నేటి నుండి తుంగభద్ర పుష్కరాలు.. జగన్ చేతుల మీదుగా !

-

కర్నూల్ లో నేటి నుంచి తుంగభద్ర పుష్కరాలు మొదలు కానున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 01:21 కు ఈ తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఈ పుష్కరాలు 12 రోజుల పాటు సాగనున్నాయి. అంటే ఈ రోజు నుంచి డిసెంబర్ 1 వరకు ఈ పుష్కరాలు కొనసాగనున్నాయి. ఈరోజు ముహూర్తం ప్రకారం 1:21 నిమిషాల నుండి అనుమతి ఇస్తున్నా రేపటి నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులు స్నానాలు చేసేందుకు అనుమతి ఇవ్వనున్నారు.

Do you know which river has puskaralu Sri Vikari Nama Samvatsara
 

అయితే కరోనా నెగిటివ్ రిపోర్ట్ ఉంటేనే ఏపీ ప్రభుత్వం ఘాట్ లోకి జనాన్ని అనుమతించేలా చర్యలు తీసుకుంటోంది. ఒకవేళ నెగటివ్ రిపోర్ట్ లేకుంటే కనక వారికి ధర్మ స్క్రీనింగ్ నిర్వహించి లోపలికి అనుమతించే ఆలోచనలో అధికారులు ఉన్నారు. ఈ విషయం మీద పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. ఈరోజు కర్నూలు వెళ్లనున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అక్కడే పుష్కరాలను ప్రారంభించనున్నారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news