హైదరాబాద్ లో దొరికిన నెల్లూర్ మిస్సింగ్ ఫ్యామిలీ !

మూడు రోజులుగా నలుగుతోన్న సస్పెన్స్ వీడింది. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో  మూడు రోజుల క్రితం అదృశ్యమైన ఇద్దరు తోడికోడళ్ళు ముగ్గురు చిన్నారుల ఆచూకీ లభ్యమైంది. నెల్లూరు వెంకటగిరిలో కనబడకుండా పోయిన ఇద్దరు తోటి కోడలు ముగ్గురు చిన్నారులను హైదరాబాద్ లో గుర్తించారు. వారందరినీ హైదరాబాద్ నుంచి వెంకటగిరి కి తీసుకొస్తున్నారు పోలీసులు. అయితే మూడు రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో వీరి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఎట్టకేలకు వారిని హైదరాబాద్ లో గుర్తించారు.

పిల్లలకు ఆరోగ్యంగా సరిగ్గా లేదు వారిని ఆసుపత్రిలో చూపించాలి అని చెప్పి ఆటోలో బయలుదేరి వెళ్లిన ఈ ఇద్దరు మహిళలు వారిని తీసుకుని హైదరాబాద్ చేరుకున్నారు. అయితే హైదరాబాద్ కి వీళ్ళందరూ చేరడంతో పోలీసులు ఇక్కడికే ఎందుకు వచ్చారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో ఏమైనా గొడవలు ఉన్నాయా లేక వివాహేతర సంబంధాలు లాంటి కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.