నిండు ప్రాణం తీసిన టిక్‌టాక్‌.. వీడియో కోసం ఏకంగా..!

-

షార్ట్ వీడియోస్ ట్రెండ్ ప్రజెంట్ బాగా పెరిగింది. టిక్‌టాక్‌ ( Tik Tok ) పుణ్యామాని ప్రపంచవ్యాప్తంగా అలాంటి యాప్స్ బోలెడు పుట్టుకొచ్చాయి. ఇక ఇండియాలో టిక్ టాక్ నిషేధం కాగా, ఆల్టర్నేట్ దేశీ యాప్స్ చాలానే వచ్చాయి. ఈ సంగతులు పక్కనబెడితే..అనవసర ఆలోచన, ప్రయోగం వల్ల ఓ యువతి 160 అడుగుల ఎత్తు నుంచి కిందపడిపోయింది. ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఇంతకీ సదరు యువతికి ఎందుకు అలా చేయాలనిపించింది? అనవసర ప్రయోగం ఏంటి? తదితర విషయాలు తెలియాలంటే మీరు ఈ కథనాన్ని పూర్తిగా చదవాల్సిందే.

చైనాకు చెందిన 23 ఏళ్ల జియావో క్యుమీ క్రేన్ ఆపరేటర్. టిక్ టాక్ అంటే ఈమెకు ఫుల్ పిచ్చి. డిఫరెంట్ అండ్ యూనిక్ వీడియోస్‌లో యాక్ట్ చేసి పేరు తెచ్చుకోవాలనుకుంది. ఈ క్రమంలోనే క్రేన్ ఆపరేటర్‌గా పని చేస్తూనే ఆమె పలు వీడియోలు చేసింది. వాటికి వ్యూస్ లక్షల్లో వచ్చాయి. అలా పలువురిని ఆమె ఇన్‌ఫ్లుయెన్స్ కూడా చేసింది. టిక్ టాక్ స్టార్‌గా ఎదిగింది. డిఫరెంట్ యాంగిల్స్‌లో జాగ్రత్తలు తీసుకుంటూ వీడియోలు చేసేది జియావో. ఈ క్రమంలోనే మరో డిఫరెంట్ వీడియో చేయాలనుకుంది. దాంతో ఇంకా ఫుల్ పాపులర్ కావాలనుకుంది.

కానీ, అదే ఆమె ఆఖరి వీడియో అవుతుందనుకోలేదు. ఇటీవల క్రేన్ ఆపరేటర్‌గా పని చేస్తున్న సమయంలో కో వర్కర్స్ అందరూ లంచ్‌కు వెళ్లినపుడు 160 అడుగుల ఎత్తులో క్రేన్ క్యాబిన్‌లో కూర్చుని వీడియో తీసుకోవడానికి ప్రయత్నించింది జియావో. ఆ టైంలో జాగ్రత్తలు తీసుకోవడం మొత్తానికే పక్కకు పెట్టింది. అలా వీడియో తీసే క్రమంలో అదుపు తప్పి కింద పడిపోయింది. ఇదంతా లైవ్ వీడియో స్ట్రీమింగ్‌లో రికార్డు కాగా, అది చూసి ఆమె ఫ్యాన్స్ షాక్ అయ్యారు. మొత్తంగా ఇంకా పాపులర్ కావాలని అనుకుని అనవసర ఆలోచన ప్లస్ ప్రయోగం చేసి 23 ఏళ్లకే టిక్ టాక్ స్టార్ జియావో సడెన్‌గా చనిపోయి తన ఫ్యామిలీ మెంబర్స్‌కు తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని, టిక్ టాక్ వీడియోల మోజులో పడి జాగ్రత్తలు తీసుకోవడం మరిచిపోవద్దిని పలువురు నిపుణులు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news