TigerNageswaraRao : “టైగర్‌ నాగేశ్వరరావు” నుంచి ప్రీ లుక్‌ రిలీజ్‌..ఊర మాస్‌ గా రవితేజ

-

మాస్ మ‌హా రాజ రవితేజ.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అయితే…. రవితేజ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌స్తున్న తాజా సినిమా టైగ‌ర్ నాగేశ్వ‌ర్ రావు. 1970లో స్టూవ‌ర్టుపురంలోని టైగ‌ర్ నాగేశ్వ‌రరావు అనే ఒక దొంగ జీవిత చ‌రిత్ర ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు.ఈ సినిమాను వంశీ తెర‌కెక్కిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో రేణు దేశాయ్ ఒక కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో నుపుర్ స‌న‌న్ ను హీరోయిన్ గా చిత్ర బృందం ఫిక్స్ చేసింది. నుపుర్ స‌న‌న్ సింగ‌ర్ గా బాలీవుడ్ కు పరిచయం అయింది. కృతి స‌న‌న్ సోద‌రియే.. నుపుర్ స‌న‌న్. ఇది ఇలా ఉండగా.. తాజాగా ఈ సినిమా నుంచి మరో అదిరిపోయే అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా నుంచి ప్రీ లుక్‌ ను రిలీజ్‌ చేశారు. మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదుగా ఈ ప్రీ లుక్‌ ను రిలీజ్‌ చేయించింది చిత్ర బృందం. ఇక ఈ ప్రీ లుక్‌ లో మాస్‌ మహరాజు చాలా మాస్‌ గా కనిపించాడు. ఓ కొరడా పట్టుకుని.. భయంకరంగా కనిపిస్తున్నాడు రవితేజ.

Read more RELATED
Recommended to you

Latest news