తెలంగాణలో విషాదం.. కన్న కూతురి కాళ్లు, చేతులు నరికిన తండ్రి !

-

తెలంగాణ రాష్ట్రంలో మరో విషాదం చోటుచేసుకుంది.    ప్రాణంగా కాపాడుకోవాల్సిన తండ్రే కుమార్తెను దారుణంగా హత్య చేశాడు. కన్న కూతురి… కాళ్లు మరియు చేతులు నరికి చంపేశాడు ఓ కసాయి తండ్రి.  తాను వద్దన్నా వినకుండా ఒక అబ్బాయి తో స్నేహంగా ఉండటమే అందుకు కారణం. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం పాతపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది.

మంగళవారం తండ్రి కుమార్తెల మధ్య వాగ్వాదం జరిగింది. విచక్షణ కోల్పోయిన రాజశేఖర్ తన 15 ఏళ్ల కుమార్తె గీత పై గొడ్డలితో 8సార్లు వేటు వేసి చంపేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. ఇక ఈ  ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు…. విచారణ మొదలుపెట్టారు. కన్న కూతురిని చంపేoత కోపం తండ్రికి ఎందుకు వచ్చింది ? నిజంగానే ఈ ఘటన వెనుక ప్రేమ వ్యవహారం ఉందా ? లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news