మీ పెరటిలో చేపలు కూడా పెంచొచ్చు తెలుసా.. ఎలాగంటే..?

-

చాలా మందికి మనుషుల కంటే పెంపుడు జంతువులపైనే ప్రేమ ఎక్కువగా ఉంటుంది. వాటికి ఏదైనా జరిగితే తట్టుకోలేరు. వాటికి బర్త్ డేలు, కొందరైతే పెళ్లి కూడా చేస్తారు. అయితే చాలా మంది తమ ఇళ్లలో కుక్క, పిల్లులు, పావురాలు, రామచిలుకలు, ఇతర పక్షులను మాత్రమే పెంచుకుంటారు. ఇక పల్లెల్లో అయితే కోళ్లు, బాతులు, గొర్రెలు, మేకలను పెంచుకుంటూ ఉంటారు. ఇవే కాకుండా మీరు చేపలను కూడా పెంచుకోవచ్చు తెలుసా.. పెంచుకోవడం అంటే షోకేజ్ కోసం అక్వేరియంలో ఉంచడం కాదు. పెద్దసంఖ్యలో చేపలను పెంచుతూ వాటి ద్వారా ఆదాయం కూడా పొందవచ్చు. అదేలాగంటే..?

మీ ఇంట్లో చేపలను కూడా పెంచుకోవచ్చు. అంతేకాదు దీని ద్వారా బోల్డెండ ఆదాయం సంపాదించొచ్చు. చేపల పెంపకం ద్వారా ఇంటి పరిసరాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. వీటితో గడుపుతూ అప్పుడప్పుడు హాయిగా సేదతీరొచ్చు. చాలా మంది ఇళ్లలో అక్వేరియం పెట్టుకుంటారు. ఇది ఇంట్లో అలంకరణ కోసం మాత్రమే. కానీ ఇంటి చుట్టుపక్కల ఉండే ఖాళీ ప్రదేశంలో చేపలను పెంచుకుంటే ఆదాయంతో పాటు ఆహ్లాదకరంగా ఉంటుంది.మరి మీ ఇంటి పెరటిలో చేపలు ఎలా పెంచాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం..?

ఇంటి పెరట్లో పూల మొక్కలు, కూరగాయలు పెంచుకుంటూ ఉంటారు. అలాగే చిన్నపాటి చెరువు ఏర్పాటు చేసుకుని చేపలు కూడా పెంచుకోవచ్చు. పెరట్లోనే కాదు.. మీ ఇంటి మేడపై కూడా చేపలు పెంచుకోవచ్చు.

ఇంట్లో కొలను తవ్వుకోవాలి.. కనీస లోతు 1-1.5 మీ ఉండాలి. 10-15 సెం.మీ పొడవు గల ఒక చేపకు కనీసం 50 లీటర్ల నీరు ఉండాలి.

ధ్వనించే ప్రదేశాలు , రహదారుల నుంచి దూరంగా ఉండాలి.

చెట్ల నీడ ఉండాలి. కానీ చెట్ల కింద గుంత ఉండకూడదు. ఎందుకంటే పడిపోయే ఆకులు నీటిని కలుషితం చేస్తాయి.

లోతట్టు ప్రాంతాలలో ఉండకూడదు, ఎందుకంటే వర్షపునీటిని ప్రవహించడం ద్వారా కలుషితమయ్యే ప్రమాదం ఉంది.

చెరువు నిర్మించడానికి ఏం చేయాలంటే..

  • పిండిచేసిన రాయి
  • ఇసుక,
  • సిమెంట్
  • 3-4 మిమీ వ్యాసం, 30×30 సెం.మీ. కణంతో ఉపబల మెష్
  • బోర్డుల నుంచి ఫార్మ్‌వర్క్,దిగువన గోడలను వాటర్ ప్రూఫింగ్ చేయడానికి రూఫింగ్ భావించారు లేదా ఇతర పదార్థాలు
  • ఇన్లెట్ మరియు అవుట్లెట్ ఓపెనింగ్స్ కోసం పైపులు, దిగువ, గోడలను ప్లాస్టరింగ్ చేయడానికి వాటర్ఫ్రూఫింగ్ స్లాబ్ కావాలి.

ఇదంతా రెడీ అయ్యాక అందులో చేపలు వేయాలి. ఏ రకం చేపలనైననా పెంచుకోవచ్చు. మార్కెట్ లో చేపల మేత దొరుకుతుంది. రోజూ పొద్దున, సాయంత్రం చేపలకు మేత వేయాలి. వారానికోసారి కొత్త నీళ్లు చేర్చాలి.

Read more RELATED
Recommended to you

Latest news