బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే ఈ టిప్స్ మీకోసం..!

-

చాలా మంది ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ బరువు ఉంటారు. అటువంటి వాళ్ళు బరువు తగ్గడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీరు కూడా బరువు తగ్గాలనుకుంటున్నారా..?, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించడం లేదా..? అయితే తప్పకుండా మీరు ఈ టిప్స్ పాటించండి.

దీని వల్ల మీరు సులువుగా బరువు తగ్గొచ్చు. పైగా ఈ హెల్త్ టిప్స్ ఏమి పెద్ద కష్టం కూడా కాదండీ.. చిన్న చిన్న మార్పులు చేస్తే సరిపోతుంది. మరి ఇక ఆలస్యం ఎందుకు దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూసేద్దాం.

నిద్ర పోవడానికి రెండు గంటల ముందు తినండి:

చాలా మంది తినేసి వెంటనే నిద్ర పోతూ ఉంటారు. అలా చేయడం వల్ల త్వరగా బరువు పెరిగిపోతారు. కాబట్టి నిద్ర పోవడానికి రెండు గంటల ముందు మీరు డిన్నర్ చేయడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల బరువు తగ్గొచ్చు.

తినే ముందు మంచి నీళ్లు తాగండి:

ఎక్కువ నీళ్లు తాగడం అలవాటు చేసుకోవడం మంచిది. చాలా మంది మంచి నీళ్లు తాగడం ఎంత ముఖ్యమో తెలుసుకోరు. ఫ్లూయిడ్స్ ని ఎక్కువగా తీసుకోవడం వల్ల హైడ్రేట్ గా ఉండొచ్చు. అయితే బరువు తగ్గాలనుకునే వాళ్ళు తినే ముందు నీళ్లు తాగండి. దీనివల్ల తక్కువ ఆహారం తీసుకోవడానికి వీలవుతుంది. ఇలా ఆహారం కంట్రోల్లో ఉంటే బరువు కూడా పెరగరు.

గోరువెచ్చని నీళ్లు తాగడం:

ఉదయం పూట టీ కాఫీ కి బదులుగా గోరు వెచ్చని నీళ్లు తాగితే బరువు తగ్గొచ్చు. గోరు వెచ్చని నీళ్లు తాగడం వల్ల అజీర్తి వంటి సమస్యలు ఉండవు. పైగా బరువు తగ్గడానికి కూడా ఇది బాగా సహాయపడుతుంది.

నూనెని తక్కువగా వాడండి:

నూనె ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా బరువు పెరిగి పోతూ ఉంటారు. కాబట్టి వీలైనంత వరకూ తక్కువ నూనె వాడండి. నూనెలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. దాని వలన బరువు పెరిగి పోతూ ఉంటారు కానీ తరగరు కాబట్టి నూనెని తగ్గించుకుంటే మంచిది. ఇలా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు ఈ టిప్స్ పాటిస్తే ఎంతో ప్రయోజనకరం కలుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news