ముక్కలైపోయిన మనసుని అతికించేందుకు సులువైన మార్గాలు మీకోసం..!

ఏ రిలేషన్షిప్ లో అయినా సమస్యలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఇద్దరి మధ్య గొడవలు చాలా ఎక్కువై పోతుంటాయి. దీనివల్ల మనస్సు కూడా ముక్కలై పోతూ ఉంటుంది. అయితే కాస్త సమయం తీసుకున్న తర్వాత మళ్లీ వాళ్లతో మనకి కలిసి ఉండాలని.. విరిగిన మనసుని అతికించుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది. మీకు కూడా అలానే ఇప్పుడు అనిపిస్తోందా..? అయితే తప్పకుండా ఇలా చేయండి ఇలా చేస్తే ముక్కలైపోయిన మనసుని మళ్లీ అతికించడానికి అవుతుంది.

చాలామంది ఒకసారి తప్పు చేసాను కదా మళ్లీ వెళ్లి ఎలా సర్దుబాటు చేసుకోగలం అని అనుకుంటూ ఉంటారు అయితే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. అది ఏంటంటే మీకు వారిపై ఎంత ప్రేమ ఉందో వారికి కూడా మీ పై అంత ప్రేమ ఉంటుందని… అలాంటప్పుడు సులభంగా మనం విరిగిన మనసుని అతికించాడు అవుతుంది.

ఇద్దరి మధ్య వచ్చిన గ్యాప్ ని క్లోజ్ చేసేయండి:

మీ ఇద్దరి మధ్య వచ్చిన గ్యాప్ ని క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇలా మీరు మళ్లీ ఇది వరకులాగే రిలేషన్ షిప్ లో ఉండొచ్చు.

క్షమాపణ చెప్పండి:

మీరు ఏమైనా తప్పు చేసి ఉంటే దానికి క్షమాపణ చెప్పండి దానితో తిరిగి మళ్ళీ మీ పార్టనర్ మీ వద్దకు వచ్చే అవకాశం ఉంటుంది.

పాజిటివ్ గా ఆలోచించండి:

మీరు కనుక పాజిటివ్ గా ఆలోచిస్తే కచ్చితంగా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది చాలా మంది నెగిటివ్ ఆలోచించనలు రావు. ఇబ్బందులు కూడా వుండవు.

మర్యాదగా మాట్లాడండి:

మీ పార్ట్నర్ పట్ల మర్యాదగా ప్రవర్తించండి ఒక మంచి మెసేజ్ పెట్టి వాళ్ళ మనసుని మార్చండి ఒకవేళ కనుక వాళ్లు మిమ్మల్ని బ్లాక్ చేసి ఉన్నట్లయితే మెయిల్ పెట్టడం వంటివి చేయవచ్చు.

కూర్చుని మాట్లాడండి:

ఇద్దరూ కలసి కూర్చుని మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోండి దీంతో సమస్యలు పరిష్కారమవుతాయి ఇలా విరిగిన మనసు అతికించవచ్చు.