ముఖం మీద మొటిమలు ఏర్పడడానికి కారణాలు.. పోగొట్టుకునే చిట్కాలు..

-

ముఖం మీద మొటిమలు ఏర్పడడానికి చాలా కారణాలుంటాయి. ఆ చాలా రకాల కారణాల్లో కొన్ని మనం స్వయంగా చేసుకున్నవే అయ్యుంటాయి. మొటిమల్లో చీము ఏర్పడి రక్తం వచ్చేలా తయారవుతుంటే మాత్రం వాటిపై చాలా కేర్ తీసుకోవాల్సిందే. లేదంటే అవి మీ ముఖంపై మరకల్ని పడేలా చేసి, ఇబ్బంది పెడుతుంటాయి. ఐతే ఇలాంటి మొటిమలు ఏర్పడకుండా ఉండేందుకు మనం తీసుకునే జాగ్రత్తలేంటో చూద్దాం.

హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ వాడడం వల్ల

అవును మీరు చదివింది నిజమే, హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ వాడడం వల్ల ముఖంపై మొటిమలు ఏర్పడతాయి. ఇష్టం వచ్చిన ప్రోడక్ట్స్ వాడడం వల్ల అవి మీ ముఖభాగంలో ఉండే చర్మంపై నెగెటివ్ ప్రభావం చూపిస్తాయి. అందుకే హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ వాడేముందు జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు ఒక పర్టిక్యులర్ బ్రాండ్ కి స్టిక్ అవడం మంచిది.

చర్మ సంరక్షణ సాధనాలు

మార్కెట్లో కొత్తగా వచ్చిన ప్రతీ ప్రోడక్టుని తీసుకొచ్చి మీ ముఖంపై ప్రయోగం చేయకండి. దీనివల్లే అన్న్ని అనర్థాలు జరుగుతాయి. ఇలాంటి వాటి నుండి రక్షణ పొందాలంటే మీ చర్మ రకానికి ఏదైతే సూటవుతుందో తెలుసుకుని వాడడం ఉత్తమం.

పొడి చర్మాన్ని పట్టించుకోకపోవడం వల్ల

చర్మం పొడిగా ఉండడం కూడా మొటిమలు రావడానికి కారణంగా నిలుస్తుంది. పొడి చర్మాన్ని పట్టించుకోకుండా అలాగే వదిలేస్తూ ఉంటే పగుళ్ళు ఏర్పడి, మొటిమలకి కారణం అవుతుంది. అందుకే పొడి చర్మం ఉన్నవారు ఎప్పటికప్పుడు చర్మాన్ని తేమగా ఉంచుకోవాలి.

ప్రాసెస్డ్ ఫుడ్ ఆహారంగా తీసుకోవడం వల్ల

ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ వంటివి ఆహారంగా తీసుకోవడం వల్ల మొటిమలు ఊరికే వచ్చేస్తాయి. అందుకే ప్రాసెస్డ్ ఫుడ్ కి దూరంగా ఉండడమే మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news