దారుణం.. లిఫ్ట్‌ ఇస్తామ‌ని చెప్పి మైన‌ర్ బాలిక‌పై అత్యాచారం..

-

ఓవైపు దిశా హత్యాచార ఘటనలో నలుగురు నిందితుల్ని ఎన్‌కౌంటర్ చేసినా కూడా కామాంధులు మాత్రం కళ్లు తెరవడం లేదు. ఎన్ని కఠిన చట్టాలు వచ్చిన అమ్మాయిలపై అత్యాచారాలు ఆగడం లేదు. తాజాగా తిరుపతికి సమీపంలో బాలికపై అత్యాచారం జరిగింది. రూరల్ మండలం ముళ్లపూడి గ్రామానికి చెందిన ఓ బాలికకు లిఫ్ట్ ఇస్తామంటూ నమ్మించి ఇద్దరు యువకులు ఆమెను ముళ్ళపొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన తిరుచానూరు పోలీసులు నిందితులు రాజమోహన్, వెంకటేశ్ ను అరెస్టు చేశారు. కాగా, తిరుపతి రూరల్ మండలం, బ్రహ్మణపట్టుకు చెందిన వెంకటేష్, పద్మావతిపురంకు చెందిన రాజమోహన్ నాయక్ లు నవంబర్ 24వ తేదీ రాతి ఓ మైనర్ బాలికను అత్యాచారం చేసినట్లు డిఎస్పీ మురళీకృష్ణ తెలిపారు.

24వ తేదీ రాత్రి పద్మావతిపురం వద్ద బైక్ పై వెళుతున్న వెంకటేష్ ను బాలిక లిఫ్ట్ అడిగింది. దీంతో వెంకటేష్ తిరుచానూరు వరకు లిఫ్ట్ ఇస్తానని చెప్పి బైక్ ఆపకుండా ముళ్ళపూడికి తీసుకెళ్ళాడు. అయితే బండికి పెట్రోల్ అయిపోయిందని చెప్పి తన స్నేహితుడు రాజా మోహన్ నాయక్ కు ఫోన్ చేసి రమ్మని చెప్పాడు. అనంతరం ఇద్దరు కలిసి ముళ్లపొదళ్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశార‌ని పోలీసులు వెల్ల‌డించారు. అత్యాచారానికి పాల్పడిన వెంకటేశ్, రాజమోహన్ నాయక్‌గా గుర్తించి అరెస్ట్ చేశామ‌ని ఆయ‌న తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news