ఆర్ధిక ఇబ్బందులు తొలగిపోవాలంటే శ్రీరామ నవమి నాడు ఇలా చెయ్యండి..!

-

దేశంలోని ప్రజలంతా సిరిసంపదలతో, సుఖసౌఖ్యాలతో ఉంటే అదే రామరాజ్యం అని హిందువుల నమ్మకం. రాముడు జన్మ దినమున ప్రజలు పండుగగా శ్రీరామ నవమి జరుపుకుంటారు. ఈ పండగ సందర్భంగా హిందువులు ఇళ్లల్లో రాముడికి పూజలు చేస్తారు.

శ్రీరాముడు ఆలయాల్లో సీతా రాముల విగ్రహాలకు కల్యాణోత్సవం నిర్వహిస్తుంటారు. చివరగా విగ్రహాలను వీధుల్లో ఊరేగిస్తారు. ఈ పండుగని మహారాష్ట్రలో చైత్ర నవరాత్రి అంటారు ఆంధ్రప్రదేశ్లో వసంతోత్సవం అని అంటారు. తొమ్మిది రోజులపాటు ఈ ఉత్సవాన్ని చేయడం జరుగుతుంది. అయితే శ్రీరామనవమి నాడు ఈ పనులు చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. అయితే మరి శ్రీరామనవమి నాడు ఎలాంటి పనులు చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అనేదాని గురించి ఇప్పుడు చూద్దాం.

లోకానికి ఆదర్శంగా నిలిచిన శ్రీ రాముని జన్మదినం రోజున శ్రీరామ నవమి జరుపుకుంటారు అన్న సంగతి తెలిసిందే. అయితే శ్రీరామనవమి నాడు తప్పకుండా ఈ పనులు చేస్తే ఆర్థిక సమస్యలు దూరమవుతాయి.

నిజాయితీగా ఉండడం:

సాధారణంగా ప్రతి ఒక్కరు నిజాయితీగా ఉంటే మంచి జరుగుతుంది. పండగ రోజు కూడా అదే బాటలో కొనసాగితే కష్టాలు తొలగిపోతాయి. నిజాయితీగా లేకపోతే కష్టాలను అనుభవించాల్సి వస్తుంది. అబద్ధాలు చెప్పకుండా ఉంటే సమాజంలో సమస్యలు రావు అలానే ఆ దేవుడి దయ కూడా మీపై ఉంటుంది.

న్యాయంగా నడుచుకోవడం:

తప్పు అని తెలిసిన చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు తప్పు మార్గంలో వెళ్లడం వల్ల కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. పైగా ఆ తప్పుని దేవుడు ఎప్పుడూ ప్రోత్సహించడు కాబట్టి న్యాయంగా నడుచుకోవడం మంచిది.

పురాణాలను చదవండి:

దేవుడి అనుగ్రహం పొందాలంటే కొంచెం సమయం వీటికి కేటాయించడం. మంచి శ్లోకాలని పురాణాలని చదువుకోవడం మంచిది. దీని వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఆరోగ్య పరంగా, ఆర్ధిక పరంగా కూడా ఇబ్బందులు తొలగిపోతాయి.

పెద్దలకు గౌరవం ఇవ్వండి:

శ్రీరాముడు ఎప్పుడూ తన తండ్రి మాట దాట లేదు. తన తండ్రి చెప్పినట్లుగానే లక్ష్మణుడితో అడవికి వెళ్ళాడు. చిన్న వారిని పెద్ద వారిని కూడా తమ ప్రియమైన వారని రాముడు భావించేవాడు. ఇంతటి గొప్ప దేవుడి అనుగ్రహం కావాలంటే కచ్చితంగా పెద్దలను గౌరవించాలి కదా..!

పండగ రోజు ఎప్పుడూ కూడా ఎవరి బాధ పెట్టకండి. ఇలా చేయడం వల్ల మీ ఆలోచన పూర్తిగా దేవుడు మీద ఉండదు. అలానే ఇతరులపై చాడీలు చెప్పడం నిందించడం లాంటివి చేయొద్దు. మంచికి మంచే జరుగుతుంది కాబట్టి మంచి దారిలో వెళ్ళండి.

Read more RELATED
Recommended to you

Latest news