95 వ ఆస్కార్ అవార్డుల వేడుకల్లో నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పాటను ఇంత అద్భుతంగా తెరకెక్కించడానికి దర్శకుడు రాజమౌళి తో పాటు చిత్ర బృందం ఎంత కష్టపడిందో ఒకసారి పాటను పూర్తిగా గమనిస్తే తెలుస్తోంది.నాటు నాటు పాటను ఇంత అద్భుతంగా తెరకెక్కించడానికి చిత్ర బృందం ఎంతో శ్రమించాల్సి వచ్చిందని పలుమార్లు చెప్పుకొచ్చారు దర్శకుడు రాజమౌళి. ఈ పాటను భారతదేశంలోనే చిత్రీకరించాలి అనుకున్నప్పటికీ ఆ సమయంలో వర్షాకాలం కావడంతో వేరే దేశంలో చిత్రీకరించడానికి మంచి లొకేషన్ ను వెతికారు అంట. ఆ సమయంలోనే ఉక్రెయిన్ లో ఓ బిల్డింగ్ను చూసి అంతా ఓకే అనుకొని వెళ్లేటప్పటికీ అది ఉక్రెయిన్ అధ్యక్షుడు తెలిసి అనుమతి దొరకదని భావించారంట. అనంతరం అక్కడ అధికారులు ఎలాంటి ఇబ్బంది లేదు మీరు షూట్ చేసుకోండి అని అనుమతి ఇచ్చినప్పటికీ.. ఆ సమయంలో అక్కడ యుద్ధం జరగటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పుకు వచ్చారు..
అంతేకాకుండా ఈ పాటలో ఉక్రెయిన్ అధ్యక్షుడు భవనం డోమ్ సైతం కనిపిస్తుందని పూర్తిగా గమనించిన వారికి అర్థమవుతుంది.నాటు నాటు పాటలో బ్యాగ్రౌండ్ లో కనిపించే వారందరినీ జూనియర్ ఆర్టిస్టులు అనుకుంటారు.. కానీ వారంతా నిజమైన డాన్సర్ లేనట. అంతేకాకుండా అసలైన మెజీషియన్స్ నే పాటలో సంగీత కళాకారులుగా చూపించడం వల్ల జీవం ఉట్టి పడిందని చెప్పుకొచ్చారు రాజమౌళి. వీరందరికీ పాటలో స్టెప్స్ లేకపోయినా పాటలో ఉన్న భావాన్ని అర్థం చేసుకొని ఎంజాయ్ చేయటం వల్ల సన్నివేశాలు అంత బాగా పండాయని తెలిపారు.
నాటు నాటు పాటకి పనిచేసిన కొరియోగ్రాఫర్ ప్రేమ రక్షిత్ ఏకంగా ఈ పాట కోసం వందకు పైగా స్టెప్పులను కంపోజ్ చేసి రాజమౌళికి అందించారట. అందులో కొన్ని స్టెప్స్ రాజమౌళి ఎంచుకొని పాటను అద్భుతంగా తెరకెక్కించారు. అందుకే ఈ పాట విజయానికి ఫస్ట్ క్రెడిట్ ప్రేమ రక్షిత్ దేనని రాజమౌళి ఇప్పటికే చెప్పుకొచ్చారు.
ఈ పాటలో రామ్ చరణ్, ఎన్టీఆర్ వేసుకున్న సస్పెండర్స్‌ను జెన్నీ లాగి వదులుతుంది. వెంటనే వాళ్లు స్టెప్స్ మొదలుపెడతారు. అయితే ఆ సస్పెండెన్స్ లాగి వదిలినప్పుడు ఇద్దరికీ బలంగా దెబ్బ తగిలిందని కానీ కెమెరా ముందు నవ్వారని.. కట్ చెప్పగానే ఉఫ్ అంటూ ఇద్దరూ నొప్పితో తెగ ఇబ్బంది పడ్డారని చెప్పుకొచ్చారు రాజమౌళి.
అలాగే పాట మొత్తం ఒకే సస్పెండెన్స్ ఉపయోగించలేదని కొన్ని స్టెప్పుల కోసం వదులుగా ఉన్న వాటిని ప్రత్యేకంగా డిజైన్ చేయించామని స్టెప్స్ పూర్తిగా గమనిస్తే ఈ విషయం తెలుస్తుందని చెప్పుకొచ్చారు. పాటలో రామ్ చరణ్, తారక్ ఇద్దరి బాడీ లాంగ్వేజ్ ఫైట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంత పర్ఫెక్ట్ గా రావడానికి ఎన్నో టేక్స్ తీసుకోవాల్సి వచ్చిందని ఇద్దరిని సింక్ చేయటానికి చాలా కష్టపడ్డామని తెలిపారు…
పాట చివరన మట్టిలో డాన్స్ చేసే సమయంలో కాస్ట్యూమ్స్ వల్ల చాలా ఇబ్బంది పడ్డారని.. కట్ చెప్పగానే కాస్ట్యూమ్ డిజైనర్స్ వచ్చి దుస్తుల్ని శుభ్రం చేసే వారని తెలిపారు. ప్రతి ఒక్కరికి ఒకటే తరహా డ్రెస్సులను మూడు సిద్ధం చేయించామని అక్కడ వెంట వెంటనే క్లాతులు ఉతికి శుభ్రపరిచే పరిస్థితి లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడినప్పటికీ ఎక్కడ షూటింగ్కు ఇబ్బంది లేకుండా జరిపించామని చెప్పుకొచ్చారు.