నేడు తెలంగాణలో 109 క‌రోనా కేసులు.. ఒక‌రు మృతి

-

తెలంగాణ రాష్ట్రంలో గ‌డిచిన 24 గంట‌ల‌లో 109 కరోనా కేసులు న‌మోదు అయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన క‌రోనా కేసుల సంఖ్య 6,80,662 కు చెరింద‌ని వెల్ల‌డించారు. అలాగే గ‌డిచిన 24 గంట‌ల‌లో తెలంగాణ లో క‌రోనా వైర‌స్ బారీన ప‌డి ఒక‌రు మృతి చెందారని తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు కరోనా మ‌హ‌మ్మారి బారీన ప‌డి 4,022 మంది మ‌ర‌ణించారని తెలిపారు. అలాగే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 190 మంది క‌రోనా వైర‌స్ నుంచి కొలుకున్నారని తెలిపారు.

దీంతో రాష్ట్రంలో ఇంకా 3,417 యాక్టివ్ కేసులు ఉన్నాయని వెల్ల‌డించారు. కాగ గ‌డిచిన 24 గంట‌ల‌లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 20,576 మంది శాంపిల్స్ ను ప‌రీక్షించామ‌ని తెలిపారు. అందులో 3,167 ఫ‌లితాలు ఇంకా తెలియాల్సి ఉంద‌ని వెల్ల‌డించారు. కాగ రాష్ట్రంలో క‌రోనా కేసులు గ‌తంలో క‌న్నా.. కాస్త త‌గ్గిన ప్ర‌జ‌లు అంద‌రూ కూడా క‌రోనా నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచించారు. ప్ర‌తి ఒక్క‌రు క‌రోనా వ్యాక్సిన్ ను రెండు డోసులు తీసుకోవాల‌ని సూచించారు. అలాగే మాస్క్ ను కూడా త‌ప్ప‌క ధ‌రించాల‌ని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news