ఇండియా కరోనా అప్డేట్..భారీగా తగ్గిన కేసులు.. !

దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గిపోయాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 25,116 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 3,69,846 కు చేరింది. ఇక దేశంలో కరోనా పాజిటివిటి రేటు 97.51 శాతంగా ఉంది. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు దేశంలో 30 వేల నుండి 40వేల మధ్య కేసులు నమోదయ్యాయి.

ఇక గడిచిన 154 రోజులలో ఇంత తక్కువగా కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి కావడం చెప్పుకోదగ్గ విషయం. మరోవైపు దేశంలో యాక్టివ్ కేసులు 140 రోజులు కనిష్టానికి చేరాయి. దేశంలో తాజాగా 432 మంది కరొనాతో మరణించగా మృతుల సంఖ్య 4,32,079 కి చేరింది. ఇది ఇలా ఉంటే భారత్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్త నడతన సాగుతోంది. ప్రస్తుతం వ్యాక్సిన్ లు వేసుకునేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. దాంతో వ్యాక్సిన్ ల కొరత ఏర్పడింది.