మగువలకు శుభవార్త.. భారీగా పతనమైన పసిడి ధరలు..

-

మన దేశంలోని మహిళలు బంగారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే.. గత కొద్దిరోజులుగా బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రేట్లు రికార్డు స్థాయికి చేరి అస్సలు దిగట్లేదు. ప్రస్తుతం రెండేళ్ల గరిష్టంపైనే ట్రేడవుతున్నాయి. దసరా, దీపావళి పండగల సమయాల్లో దేశంలో బంగారం ధరలు కనిష్టం వద్ద ట్రేడయ్యాయి. ఇక అప్పటినుంచి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం కొనలేకపోతున్నారు. రేట్లు రికార్డు స్థాయికి చేరడం ఒక కారణంగా చెప్పొచ్చు. ప్రస్తుతం మరోసారి అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరిగినప్పటికీ.. దేశీయంగా మాత్రం కాస్త తగ్గుముఖం పట్టి కొంతైనా ఉపశమనం కల్పించాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1927 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 23.70 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ కాస్త పడిపోయింది. ప్రస్తుతం రూ.81.81 వద్ద ఉంది. ఇటీవల ఒక దశలో రూపాయి విలువ రూ.83 స్థాయికి కూడా చేరిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ తగ్గి రూ.80కి చేరింది. ఇప్పుడు రూ.81-82 మధ్య కదలాడుతోంది.

అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు కాస్త పెరిగినప్పటికీ ప్రస్తుతం దేశీయంగా మాత్రం గోల్డ్, సిల్వర్ రేట్లు పడిపోయాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.150 పడిపోయి రూ.52,500కు చేరింది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ రేటు హైదరాబాద్‌లో తులానికి ప్రస్తుతం రూ.170 మేర పడిపోయి రూ.57,270 వద్ద కొనసాగుతోంది. అయితే గత 10 రోజుల్లో గోల్డ్ రేటు పడిపోవడం ఇది రెండోసారి మాత్రమే. చివరగా ఈ మధ్యలో జనవరి 27న గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.600 మేర క్షీణించింది.

Read more RELATED
Recommended to you

Latest news