తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్ట నుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల బలోపేతం చేయడానికి నూతన పథకాన్ని తీసుకువచ్చింది. ప్రభుత్వ బడులలో మౌళిక వసతులతో పాటు వాటిని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మన ఉరు – మన బడి అనే కార్యక్రమాన్ని నేడు ప్రారంభం చేయనుంది.
ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. స్వయంగా ప్రారంభించనున్నారు. ఈ రోజు ఆయన వనపర్తి జాల్లాలో పర్యటించనున్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ఉన్న బాలుర ప్రభుత్వ పాఠశాలలో మన ఊరు-మన బడి కార్యక్రమం పైలాన్ ఆవిష్కరిస్తారు. ఈ కొత్త పథకం ద్వారా ప్రభుత్వం పాఠశాలల కోసం రూ. 7,289 కోట్ల నిధులను ఖర్చు చేయనున్నారు. కాగ ఈ పథకాన్ని దశల వారీగా అమలు చేయనున్నారు.
మొదటి దశ లో రాష్ట్రంలో ఉన్న 9,123 ప్రభుత్వ పాఠశాలలను రూ. 3,497 కోట్లతో బలోపేతం చేయనున్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్.. మన ఊరు-మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన తర్వత జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అలాగే పలు నిర్మాణాలను ప్రారంభించనున్నారు.