దుల్కర్ సల్మాన్​పై టాలీవుడ్ హీరో సెన్సేషనల్ కామెంట్స్

-

‘తెలుగు చిత్రం కోసం మలయాళ హీరోని తీసుకురావాలా? ఇక్కడ ఎవరూ లేరా? మలయాళ ఆర్టిస్టులు లేకుండా మేం తెలుగు సినిమాలు చేయలేమా?’ అంటూ నటుడు సంతోష్‌ శోభన్‌ అసహనం వ్యక్తం చేశారు. ‘సీతారామం’ సినిమాను ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అయితే, ఇది సీరియస్‌గా అన్న మాట కాదండోయ్‌.. ఓ పథకం ప్రకారం చాలా సరదాగా చిత్రీకరించిన ఓ వీడియోలోని దృశ్యం. అసలు విషయం ఏంటంటే.. మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా తెలుగు దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన చిత్రం ‘సీతారామం’. ఈ సినిమా ప్రమోషన్స్​లో భాగంగా.. ‘సీతారామం.. స్వరాలు’ పేరుతో చిత్ర బృందం మ్యూజికల్‌ కాన్సెర్ట్‌ నిర్వహించింది. దీనికి విజయ్‌ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి సంబంధించిన పలు వీడియోలను వైజయంతీ మూవీస్ సంస్థ నెట్టింట విడుదల చేసింది. సంతోష్‌ శోభన్‌ ఫన్నీ కాన్సెప్ట్‌ వీటిల్లోని ఓ భాగమే. ఈ వేడుకకు వచ్చేముందు సంతోష్‌ శోభన్‌, నటి మాళవిక నాయర్‌ ‘సీతారామం’ గురించి ఏమనుకున్నారో సీక్రెట్‌గా చిత్రీకరిస్తారు యాంకర్‌ సుమ. ఆ వీడియోను కార్యక్రమంలో అందరి ముందు ప్రదర్శిస్తారు.

అనంతరం, సంతోష్‌, మాళవికలను సుమ వేదికపైకి ఆహ్వానిస్తారు. ఈ క్రమంలోనే ఇదంతా వారు కావాలనే చేశారని తెలిసిపోతుంది. అయినా సంతోష్‌ ఒప్పుకోరు. ‘తెలుగు సినిమాల గురించి నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తేనే దుల్కర్‌ మనవాడు అనుకుంటా’ అంటూ హంగామా చేశారు. ఈ పరీక్షలో దుల్కర్‌ పాసయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news