Bangarraju: నాగార్జున కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం సోగ్గాడే చిన్ని నాయన.. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రంలో బంగార్రాజు గెటప్ లో నాగార్జున.. తనదైన శైలిలో నటించి అభిమానులు ఉర్రూతలూగించారు. కాగా ప్రస్తుతం సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు చిత్రం తెరకెక్కుతుంది అన్న విషయం తెలిసిందే.
కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో షూటింగు శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమాలో నాగచైతన్య కూడా నటిస్తున్నాడు. నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా, నాగ చైతన్య కు జోడీగా కృతి శెట్టి కనిపించనుంది.
ఈ తరుణంలో నాగార్జున నాగచైతన్య పాత్రలు ఎలా ఉండ బోతున్నాయనే వార్తలు సోషల్ మీడియా లో వైరల్ గా మారి పోతున్నాయి. కాగా ఇప్పుడు.. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట్లో వైరలయ్యింది. బంగార్రాజు సినిమా లో నాగార్జున నాగ చైతన్య ఏకంగా తాతా-మనవళ్లు గా నటించ బోతున్నట్లు తెలుస్తోంది. చనిపోయి దెయ్యం గా మారిన తాత మనవడి ప్రేమను గెలిపించడానికి ప్రయత్నాలు చేస్తాడు అనే కోణంలో ఈ సినిమా సాగిపోతుంది.
అయితే.. ఇందులో ఎవరూ తాత ? ఎవరూ మనుమడు అనే విషయంలో స్పష్టత రాలేదు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లూక్, ఇతర పోస్టర్లతో అంచనాలు పెరిగిపోయాయి. ఇక సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఏవిధంగా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.