క్రిస్మస్ సందర్భంగా తమ ఫ్యాన్స్ కి విషెస్ తెల్పిన స్టార్స్…

-

క్రైస్తవులు ఎంతో వైభవంగా జరుపుకునే క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని నేడు ప్రపంచవ్యాప్తంగా వేడుకలు ఎంతో అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. పలు చర్చిల్లో ప్రజలు ప్రార్ధనలు చేస్తూ, యేసు ప్రభువు పై తమ భక్తిని చాటుకుంటున్నారు. ఇక ప్రతి ఏడాది మాదిరిగా ఈ ఏడాది కూడా క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని పలువురు తారలు తమ ఫ్యాన్స్ కు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. వారు ఎవరెవరో ఇప్పుడు చూద్దాం….!!

మహేష్ బాబు : సెలవుల సీజన్ మొదలైంది,ఇక యేసు ప్రభువు జన్మదినమైన ఈ ప్రత్యేక రోజున ప్రతి ఒక్కరం ఎంతో ఆనందముగా ప్రేమను మనతోటి వారందరితో పంచుకుందాం. ఈ పండుగ మీ అందరి జీవితాల్లో సకల సుఖాలను నింపాలని కోరుకుంటున్నాను. అందరికీ హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు.


ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ : ఈ ఏది క్రిస్మస్ పండుగ అందరి జీవితాల్లో ఆనందము నింపాలని కోరుకుంటూ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్, తమ ట్విట్టర్ అకౌంట్ ద్వారా అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు.

జూనియర్ ఎన్టీఆర్ : క్రిస్టియన్ సోదరులకు హృదయ పూర్వక క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు.

పూరి జగన్నాథ్ : అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు.

అమల అక్కినేని :  నేటి ఈ బృహత్తరమైన రోజున మీ మనసు నిండా ప్రేమ, దయ, జాలి, కరుణ వంటి గుప్పుగుణాలు వెల్లివిరవాలి. అందరికీ హృదయపూర్వక క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు.

కార్తీ : ఈ క్రిస్మస్ పండుగ, మీ అందరి జీవితాల్లో ఎంతో ఆనందాన్ని, సుఖశాంతులను అందించాలని కోరుకుంటున్నాను.

సుధీర్ బాబు : ఈ క్రిస్మస్ పండుగను అందరూ ఎంతో ఆనందంగా, ఉల్లాసంగా జరుపుకోవాలి అని కోరుకుంటున్నాను.

ఎంత మంచివాడవురా యూనిట్ : అందరికీ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు. నేడు అందరూ ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాము.

దర్బార్ మూవీ టీమ్ : అభిమానులకు మరియు ప్రేక్షకులకు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు.

Read more RELATED
Recommended to you

Latest news