గ్రహణం సమయంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు?

-

గ్రహణం అంటే మనదేశంలో చాలా జాగ్రత్తలు తీసుకునే అలవాటు ఉంది. ప్రపంచంలో శాస్త్ర సాంకేతికత అభివృద్ధి చెందకముందే పలు విశ్వరహస్యాలను మనవారు ఛేదించారు. వాటిలో ఖగోళ విషయాలు అనేకం ఉన్నాయి. ఏ సమయంలో ఏ గ్రహం ఎలా ఉంటుంది, గ్రహణాలు ఎప్పుడు, తిథులు, వాతావరణ విశేషాలు ఇలా అనేకం ఉన్నాయి. అవన్నీ సరిగ్గా జరుగుతున్నాయి. అయితే ఆయా సందర్భాలలో ఏం చేయాలి, ఏం చేయకూడదు కూడా చెప్పారు. గ్రహణం సమయంలో ఏం చేయకూడదు, ఏం చేయాలో పెద్దలు చెప్పిన విషయాలు తెలుసుకుందాం…

ఈ ఏడాది ఇప్పటికే నాలుగు గ్రహణాలు సంభవించాయి. వీటిలో రెండు సూర్యగ్రహణాలు, రెండు చంద్రగ్రహణాలు. ఈ ఏడాదిలో చివరి గ్రహణం డిసెంబరు 26న ఏర్పడుతోంది. ఈసారి ఏర్పడే కంకణాకార కేతుగ్రస్త గ్రహణం తిరిగి 16 ఏళ్ల తర్వాత సంభవించనుంది.
మరోవైపు సూర్యగ్రహణం తర్వాత సరిగ్గా 15 రోజులకు చంద్రగ్రహణం ఏర్పడనుంది. అంటే 2020 జనవరి 10న ఆ ఏడాదికి చంద్రగ్రహణం ఏర్పడుతుంది.

ఏం చేయకూడదు?
ఎవరైన గ్రహణాన్ని గ్రహణ సమయంలో ప్రత్యక్షంగా చూడ కూడదు. ఫిల్మిలతో గ్రహణం చూడకూడదు. రెగ్యులర్‌గా వాడే సన్‌ గ్లాసెస్‌తో గ్రహణాన్ని చూడరాదు. ఇంట్లో ఇతర వస్తువులతో కూడా ప్రతక్ష్యంగా గ్రహణాన్ని చూడకూడదు. గ్రహణాన్ని చూసే కంటి అద్దాలతో, సోలార్‌ ఫిల్టర్స్‌తో మాత్రమే గ్రహణాన్ని చ ూడాలి. గర్భిణీలపై గ్రహణం ప్రభావం చూపుతుందని బలంగా నమ్ముతారు. ఇది మూఢనమ్మకమా, శాస్త్రీయ కోణమా అనేది పక్కనబెడితే గర్బిణిలు కొన్ని సూచనలు పాటించాలి. గ్రహణం పట్టడానికి ఆరు గంటల ముందే భోజనం ముగించాలి. గ్రహణం మొదలైన తర్వాత ఆహారం తీసుకోరాదట. రాహు, కేతువుల చంద్రుడ్ని మింగినప్పుడు వాటి లాలాజలం భూమిపై పడుతుందని, ఇవి విషపూరితమైనవి పెద్దలు అంటారు. కాబట్టి ఆ సమయంలో ఆహారం తీసుకుంటే పుట్టబోయే బిడ్డపై ప్రభావం చూపుతాయని నమ్మకం.

గర్భంలోని పిండంపై త్వరితగతిన ప్రభావం చూపుతుందని, తద్వారా పుట్టబోయే సంతానం ఏదైనా లోపాలతో పుడతారని పెద్దలు చెబుతున్నారు. అందుకే ఈ ప్రభావం పడకుండా గ్రహణ సమయానికి ఆరు గంటల ముందుగా భోజనం చేయమని శాస్త్రం చెబుతుంది. అంటే తినే పదార్థానికి అరగడానికి సరైన సమయం అన్న మాట. సైన్స్‌ పరంగా చూస్తే గ్రహణం సమయంలో విడుదలయ్యే అతినీల లోహిత కిరణాల వల్ల ఆహారపదార్థాలపై ఉన్న క్రిమికీటకాలు మరింత పెరిగి, బ్యాక్టీరియా అధికమవుతుంది. ఇలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. గ్రహణాన్ని చూడరాదని, చూడటం వల్ల పుట్టే పిల్లలు అనారోగ్యంతో ఉంటారని చెబుతారు. అయితే వెంటనే ప్రమాదం జరుగకున్నా భవిష్యత్‌లో ఏదైనా జరుగవచ్చు. ప్రయాణాలు కూడా తప్పనిసరి అయితేనే చేయాలి. వృద్ధులు, రోగగ్రస్తులు ఏదైనా లిక్విడ్‌ ఆహారాన్ని గ్రహణం ప్రారంభం కంటే ముందే తీసుకోవాలి. ఆహారాన్ని గ్రహణం పూర్తయిన తర్వాత స్వీకరిస్తే మంచిదని పెద్దలు చెప్తారు. అయితే డాక్టర్‌ సూచనల మేరకు వారు ఆహారాన్ని స్వీకరించాలి.

ఏం చేయాలి ?
గ్రహణం సమయంలో గర్భవతులు ఎలాంటి భయందోళనలు చెందనవసరం లేదు . గ్రహణ సమయంలో మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని ధ్యానం, జపం, ఆధ్యాత్మిక చింతనతో ఉంటే చాలా మంచిది . మార్గశిర అమావాస్య నాటి అబ్ధిక కార్యక్రామాన్ని యధావిధిగా అపరాన్నకాలంలో జరుపుకోవచ్చును . గ్రహణ పట్టు , విడుపు మధ్యస్నానాలాచరించే వారు, వారికున్న మంత్రనుష్టానములతో ఆచరించి యధావిధిగా స్నానాదులు ఆచరించి నిర్విహించవచ్చును . గ్రహణం గురించి ఎవరూ ఎలాంటి భయం కాని అందోళన కాని చెందవద్దు . గ్రహణం ముగిసిన తర్వాత ఇల్లు శుభ్రంగా కడుక్కొని , స్నానం చేసే నీళ్ళలో చిటికెడు పసుపు,ఒక ‘టి’ స్పూన్ పచ్చి ఆవుపాలు, రెండు హారతి కర్పూరం బిల్లలను చూర్ణం చేసుకుని నీళ్ళలో వేసుకుని తల స్నానం చేసుకోవాలి.ఆ తర్వాత ఇంట్లో ఉన్న పూజాగదిని శుభ్రపరచుకుని గాయత్రి ( జంధ్యం ) ని మార్చుకుని , పూజ మందిరంలో ఉన్న దేవత విగ్రహాలకు పులికాపి/శుభ్రం చేసుకోవాలి.

షష్ట గ్రహ కూటమిలో సూర్యగ్రహణ వల్ల ఏం జరుగబోతుందో తెలుసా ?
శుద్ధమైన నీళ్ళలో చిటికెడు పసుపు వేసి దేవుని విగ్రహాలు,యంత్రాలను ప్రోక్షణ చేసిన తరవాత దీపారాధన అలంకరణం చేసి నైవేద్య నివేదన కొరకు బెల్లంతో చేసిన మరమాన్నం వండి దేవునికి నివేదన చేసి హారతి ఇచ్చి మనస్సును ప్రశాంతగా ఉంచుకుని మూడు ప్రదక్షిణలు నిధానంగా చేసి తమకున్న సమస్త గ్రహాదోష నివారణ కలిగించమని సాష్టాంగా నమస్కారం చేస్తూ విన్నవించుకోవాలి , ఆడవారు సాష్టాంగ నమస్కారం ఎప్పుడు, ఎక్కడ చేయకూడదు. ఆడవారు కేవలం మోకాళ్ల పైనే చేయాలి.ముఖ్యంగా గర్భిణిలు నిలబడే నమస్కరించుకోవాలి . ఇంట్లో పూజ పూర్తీ అయిన తర్వాత గుడికి దైవ దర్శనాలకు వెళ్ళే వారు వెళ్ల వచ్చును.మొదట ఇంట్లో పూజ చేయనిది దేవాలయాలకు ఎప్పుడూ వెళ్ళకూడదు. ఆ రోజు శక్తి కొలది ఆవునకు ఉలవలు ,బెల్లం , అరటి పండ్లు విస్తరి ఆకులో కాని అరటి ఆకులో కాని పెట్టి ఆవుకు తినిపించి మూడు ప్రదక్షిణలు చేస్తే మంచిది.

గ్రహణం తర్వాత దానాదులను చేయడం వల్ల చెడు ఫలితాలను తగ్గించుకోవచ్చు. గ్రహణ వల్ల చెడుప్రభావం ఉండి దానాలు చేయలేని వారు భయపడాల్సిన పనిలేదు. వారు తమ శక్తి మేరకు భగవంతుడిని ప్రార్ధన, ఆరాధన, ధ్యానం చేసుకుని శాంతితో సహనంతో కాలం గడిపితే మంచిది. చెడు సమయం అంటూ నిజానికి ఏది ఉండదు. చెడు ఫలితాల వల్ల జీవితానికి కావల్సిన
అనుభవం, అన్నింటిని తట్టుకునే శక్తి వస్తుంది. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు గ్రహణ స్నానం, పట్టువిడుపు స్నానాలను చేయడం, ధాన్యం, జపం, దానం, దేవాలయ సందర్శనం, ప్రదక్షణలు, దీపారాధన మంచి ఫలితాన్నిస్తాయి.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news