కేరళను కలవరపెడుతున్న టమాటా ఫ్లూ..

-

కరోనా వైరస్ తో సతమతమవుతున్న ప్రజలపై కొత్త కొత్త వైరస్ లు దాడి చేస్తున్నాయి. కేరళలో టమాటా ఫ్లూ కలవరపెడుతోంది. చిన్నారులు టమాట ఫ్లూ బారిన పడుతుండడంతో… రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో భయాందోళనలు కలుగుతున్నాయి. అయితే.. ప్రధానంగా ఐదేళ్లలోపు పిల్లలు ఈ వైరస్‌ బారిన పడుతున్నారు. ఇప్పటివరకు 80 మందికి పైగా చిన్నారులు టమాటా ఫ్లూ బారిన పడ్డారు. ఈ కేసులన్నీ ఒక్క కొల్లం జిల్లాలోనే నమోదవడం గమనార్హం. టమాటా ఫీవర్‌గా పిలిచే ఈ వైరస్‌ అత్యంత అరుదైనదని వైద్య నిపుణులు చెబుతున్నారు. టమాటా ఫీవర్ సోకిన చిన్నారుల చర్మంపై చాలాచోట్ల ఎర్రటి బొబ్బలు వస్తాయని, అవి టమాటా ఆకారంలో ఉండటంతో దీనికి ఆ పేరు పెట్టారు వైద్యులు.

Tomato Fever in Kerala: Know Tomato Fever Symptoms, Causes, Treatment and  Prevention here

దీంతో పాటు తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, బలహీనత, డీహైడ్రేషన్‌ వంటి లక్షణాలు ఉంటాయని, కొందరు పిల్లల్లో జలుబు, దగ్గు, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, చేతులు, మోకాళ్లు, పిరుదుల రంగు మారడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తునట్లు వైద్యులు వెల్లడిస్తున్నారు. ఈ వ్యాధికి గల కారణాలపై ఇంకా స్పష్టత లేదు. టమాటా ఫ్లూ ఇతర ప్రాంతాలకూ వ్యాపించే ప్రమాదముందని ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. టమాటా ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో కేరళ పొరుగు రాష్ట్రం తమిళనాడు అప్రమత్తమైంది.

Read more RELATED
Recommended to you

Latest news