మూడు రోజుల నుండి ఎంపీ అవినాష్ రెడ్డిని విచారించాలన్న సిబిఐ కోరిక తీరని లేదు. తెలంగాణ హై కోర్ట్ లో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం పిటీషన్ వేశారు. కానీ ఆ పిటీషన్ పై హై కోర్ట్ ఎటూ తేల్చకపోవడంతో విచారణ కాస్త లేట్ అయ్యేలా ఉంది. కానీ ఈ రోజు హై కోర్ట్ లో అటు అవినాష్ రెడ్డి తరపు లాయర్ మరియు సిబిఐ కి సంబంధించిన లాయర్ తమ వాదనలు వినిపించారు. మాములుగా ముందు ఇచ్చిన నోటీసుల ప్రకారం సిబిఐ అవినాష్ రెడ్డికిని ఈ రోజు సాయంత్రం విచారించాల్సి ఉంది. కానీ… తాజాగా సిబిఐ అధికారుల నుండి అందితున్న సమాచారం ప్రకారం అవినాష్ రెడ్డిని రేపు విచారించనున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని సిబిఐ తరపున లాయర్ లు న్యాయమూర్తికి తెలియచేశారు.
కాగా అవినాష్ రెడ్డి బెయిల్ పిటీషన్ పైన ఎటూ తేల్చకపోవడంతో అవినాష్ రెడ్డి రేపు తప్పక విచారణకు హాజరవ్వక తప్పేలా లేదు. మరి రేపు విచారణకు అవినాష్ రెడ్డి సహకరిస్తాడా లేదా తెలియాల్సి ఉంది.