కరోనా నేపథ్యంలో చాలా మంది ఇళ్లలోనే ఉంటున్నారు. దీంతో సామాజిక మాధ్యమాల వాడకం ఎక్కువైంది. ఎప్పుడూ ఫోన్లు, కంప్యూటర్లతో కుస్తీలు పడుతూ కనిపిస్తున్నారు. ఇక విద్యార్థులు అయితే ఎక్కువ సేపు గ్యాడ్జెట్ల స్క్రీన్ల ఎదుట కూర్చోవాల్సి వస్తోంది. దీంతో వారిలో మానసిక సమస్యలు వస్తున్నాయి. ఈ విషయాన్ని సైంటిస్టులు తమ అధ్యయనం ద్వారా వెల్లడించారు.
ఎక్కువ సేపు ఫోన్లు, ట్యాబ్లెట్లు, కంప్యూటర్లు, టీవీ తెరలను చూడడం వల్ల యుక్త వయస్కుల్లో ఆందోళన, ఒత్తిడి వంటి మానసిక సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని సెయింట్ జేమ్స్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన పరిశోధకులు వెల్లడించారు. ఈ విషయాన్ని వారు ఇటీవలే వరల్డ్ మైక్రోబి ఫోరం సమావేశంలో చర్చించారు.
కరోనా వల్ల ఇళ్లలోనే ఉంటున్న విద్యార్థులు ఎక్కువ సేపు గ్యాడ్జెట్ల స్క్రీన్లను చూస్తున్నారని దీంతో మానసిక సమస్యలు వస్తున్నాయని అంటున్నారు. యుక్త వయస్కుల్లోనే ఎక్కువగా ఈ సమస్య వస్తుందని తెలిపారు. అయితే ఎవరూ డిప్రెషన్ బారిన పడడం లేదని, కేవలం ఆందోళన వంటి సమస్యలే ఉంటున్నాయని తెలిపారు.
ఇక కోవిడ్ నేపథ్యంలో 70 శాతం మందికి పైగా మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారని తేలింది. వారందరూ 18 నుంచి 28 ఏళ్ల వయస్సు వారేనని అధ్యయనాల్లో తేలింది. దీనికి లింగంతో పనిలేదని, స్త్రీ, పురుషులు ఇద్దరూ ఈ సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు.