టూత్ పేస్టు వాడితే కచ్చితంగా కేన్సర్ వస్తుంది…!

-

ఈ రోజుల్లో టూత్ పేస్టు లేనిదే బ్రష్ చేయడం అనేది ఎక్కడో అరుదుగా జరుగుతూ ఉంటుంది. రకరకాల పేస్టులు మార్కెట్ లో అందుబాటులోకి వచ్చాయి. దీనికి తోడు పళ్ళల్లో సులువుగా తిరిగే బ్రష్ లు కూడా అందుబాటులోకి రావడంతో దాని వాడకం అనేది క్రమంగా పెరుగుతూ వచ్చింది. దీనితో గతంలో బొగ్గు లేదా… వేప పుల్లతో బ్రష్ చేసుకే వాళ్ళు కూడా టూత్ పేస్టు కి అలవాటు పడిపోయారు.

కాని పేస్టు అనేది కేన్సర్ రావడానికి సహకరిస్తుందని అంటున్నారు వైద్యులు. టూత్‌పేస్టులో ట్రైక్లోసన్‌ అనే బ్యాక్టీరియాను చంపే ఒక ప్రమాదకర పదార్థం ఉంటుందని… అది కాసింత కడుపులోకి వెళ్లినా సరే పేగుల్లో ఉండే ఆరోగ్యకర, అవసరమైన బ్యాక్టీరియాను చంపేస్తుందని దీనితో పేగు కేన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందని అమెరికాలోని మసాచుసెట్స్‌ ఆమ్‌హెర్స్ట్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు సంచలన విషయం బయటపెట్టారు.

ఉత్పత్తి దారులు ఆ రసాయనాన్ని వాడకుండా ఉండలేరని వాడితే మనిషికి కచ్చితంగా ప్రమాదమని అంటున్నారు. ఎలుకలకు ట్రైక్లోసన్‌ తినిపించి పరిశోధనలు చేయగా వాటి లో జీర్ణ వ్యవస్థకు అవసరమయ్యే బ్యాక్టీరియా (గట్‌ బ్యాక్టీరియా) చనిపోయినట్లు గుర్తించామని వైద్యులు వివరించారు. దీనిపై నిషేధం ఉన్నా సరే టూత్ పేస్టు ల రూపంలో ఇది మనుషులకు ప్రమాదకరంగా మారిందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news