రేవంత్ డిమాండ్‌కు స్పీకర్ దిగొస్తారా?

-

హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. ప్రమాణ స్వీకారానికి ముందే  పార్టీ బలోపేతంపై వేగం పెంచారు. అంతేకాదు అధికార పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు కూడా రేవంత్ రెడ్డి అవుతున్నారు. పార్టీలు మారిన ఎమ్మెల్యేలను ఆయుధాలుగా ఉపయోగిస్తున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఈటల రాజేందర్ రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. ఇప్పుడే ఇదే ఆయుధంగా స్పీకర్‌పై మాటల ధాటిని పెంచనున్నారు. వారందరిపై చర్యలు తీసుకోకపోతే కోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నారు. అసెంబ్లీలో పని కాకపోతే కోర్టు ద్వారానే తెల్చుకునేందుకు రేవంత్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు.

ఇక ప్రభుత్వ వ్యతిరేకవిధాలపై కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ప్రశ్నించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారట. అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేలా దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక పార్టీలో నెలకొన్న విబేధాలపై కూడా ఆయన దృష్టి సారించారు. కాంగ్రెస్ సీనియర్ నేతలను కలవడంతో పాటు పార్టీ మారిన వారిని టచ్ చేస్తున్నారు. గతంలో టీడీపీలో ఉన్న పరిచయాలతో వారిని కూడా పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. మరో వైపు ఆయన టీపీసీసీ చీఫ్‌గా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఇక రేవండ్ రెడ్డి డిమాండ్ పై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ స్పందిస్తారేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news