Traffic Alert : హైదరాబాద్​లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు

-

శ్రీరామనవమి, హనుమాన్ జయంతి పండుగల దృష్ట్యా హైదరాబాద్​లో పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా శోభాయాత్ర నిర్వహించనున్న దృష్ట్యా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ప్రతి సంవత్సరం నిర్వహించే హిందూశక్తి ప్రదర్శన, వీర హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా సమీక్ష నిర్వహించారు.

శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా జంట నగరాల్లో గురువారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయిని పోలీసులు తెలిపారు. ఆ సమయంలో పలు దారులలో వాహనాల రాకపోకలను నియంత్రించనున్నారు. గోషామహల్, సుల్తాన్ బజార్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో ఆంక్షలు ఉంటాయిని తెలియజేశారు.

దాదాపు 6 కిలోమీటర్ల మేర సాగే శోభాయాత్ర సీతారాంబాగ్ ఆలయం వద్ద ప్రారంభమై బోయగూడ కమాన్, మంగళ్​హాట్ పోలీస్​స్టేషన్ రోడ్డు, జాలి హనుమాన్, దూల్​పేట, పురానాపూల్, జుమేరాత్ బజార్, చుడిబజార్, బేగంబజార్ చత్రి, బర్తన్ బజార్, సిద్దంబర్​బజార్ మసీదు, శంకర్ షేర్ హోటల్, గౌలిగూడ కమాన్, గురుద్వారా, పుత్లిబౌలి చౌరస్తా, కోఠి ఆంధ్రా బ్యాంక్ మీదుగా సాగి చివరికి సుల్తాన్ బజార్​లోని హనుమాన్ వ్యాయామశాలకు శోభాయాత్ర చేరుకుంటుందని పోలీసు అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news