నేడు “సండే ఫన్ డే”… ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలు

-

వాహనదారులకు బిగ్ అలర్ట్. ఇవాళ హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు అధికారులు. సరికొత్త ఆటవిడుపులతో ట్యాంకు బండ్ పై ఇవాళ సండే ఫన్ డే నిర్వహిస్తున్నారు అధికారులు. సండే ఫన్ డే నిర్వహణపై రాష్ట్ర పురపాలకశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్ ట్విట్టర్ లో ప్రకటించారు.

దీంతో ఇవాళ సాయంత్రం ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు చెప్పారు పోలీసులు. సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. ఫార్ములా ఈ రేసింగ్ కారణంగా గత కొన్ని వారాల నుండి సండే ఫన్ డే కార్యక్రమాన్ని నిలిపివేశారు. సాయంత్రం సండే ఫన్ డే కార్యక్రమం కోసం ట్యాంక్ బండ్ సందర్శకుల కోసం పరిసర ప్రాంతాల్లో నాలుగు పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. ఇకపై హుస్సేన్ సాగర్ లో ఏర్పాటు చేసిన మ్యూజికల్ ఫౌంటెయిన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

Read more RELATED
Recommended to you

Latest news