టీడీపీలో విషాదం.. సీనియర్ నాయకుడు మృతి

-

సీనియర్ టీడీపీ నాయకుడు, మాజీ సహకార సంఘం అధ్యక్షులు వెలుగుబంట్ల గంగ రాజు (బూశీలు) గురువారం తన నివాసంలో మృతి చెందారు. గంగరాజు (72) ఉదయం యధావిధిగా వాకింగ్ పూర్తి చేసుకొన్న అనంతరం తన ఇంటి ఆవరణలో కుప్ప కూలిపోయి మృతి చెందారు. గంగ రాజు 1983 నుంచి టీడీపీలో క్రియాశీలక నాయకుడుగా వ్యవహా రిస్తున్నారు. నియోజకవర్గంలో అనేక అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతో మందిని శాసన సభ్యునిగా గెలిపించడం లో ప్రముఖ పాత్ర వహించారు. అదే విధంగా సర్పంచ్, ఎంపీటీసీ, సహకారం సంఘం, నీటి సంఘం ఎన్నికల్లో ప్రముఖ పాత్ర వహించారు. సహకార సంఘం అధ్యక్షులు గా రైతులకు మంచి సేవలు అందించారు.

కాజులూరు గ్రామ పెద్ద గా అనేక సమస్యలు పరిష్కరించే వారు. గంగ రాజు మరణ వార్త తెలియగానే మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు హుటాహుటిన కాజులూరు చేరుకొన్నారు. ఘనంగా నివాళులు అర్పించారు. గంగ రాజు భార్య కుమారుడు, కుమార్తె ను ఓదార్చారు. శాసన మండలి సభ్యులు తోట త్రిమూర్తులు, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్ర బోస్, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ లు సంతాపం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నీటి సంఘం అధ్యక్షులు పెద్దిరెడ్డి శేష గిరి, మాజీ సహకారం సంఘం అధ్యక్షులు యాళ్ల వెంకట రమణ, సలాది నాన్నజీ, యాళ్ళ కాసులు, వెలుగుబంట్ల సతీష్ తదితరులు పార్దీవ దేహానికి నివాళులు అర్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news