తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. సీనియర్ నిర్మాత కొడాలి బోసుబాబు మృతి చెందారు. గుండెపోటుతో హైదరాబాద్ లో ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 66 ఏళ్లు. దాసరి నారాయణ రావుకు ఆయన బంధువు అవుతారు. దాసరి భార్య దివంగత పద్మకు బోసుబాబు సోదరుడి వరస అవుతారు. తొలుత దాసరి సినిమాలకు ప్రొడక్షన్ మేనేజర్ గా పని చేసిన బోసు బాబు..
ఆ తర్వాత దాసరి ఆశీస్సులతోనే నిర్మాతగా మారారు. అక్కినేని నాగేశ్వరరావుతో “రాగదీపం” నాగేశ్వరరావు, కృష్ణలతో..” ఊరంతా సంక్రాంతి, కృష్ణతో ‘ప్రజా ప్రతినిధి ‘ శోభన్ బాబుతో ‘జీవనరాగం’ దాసరి నారాయణ రావు తో ‘పోలీస్ వెంకటస్వామి ‘ సినిమాలను నిర్మించారు. బోసు బాబు కు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు.ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.