ఈరోజుల్లో తినే రెస్టారెంట్లో ఫుడ్ కంటే.. ఫర్నీచర్, బ్యాగ్రౌండ్ సీనరీ మీదే ఎక్కువ మంది ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే.. యువతకు సెల్ఫీలు, వీడియోల మీదే ఎక్కువ శ్రద్ధ. ఈ లిస్ట్‌లో ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ కూడా జాయిన్ అయిపోయాయి. భారతీయ రైల్వే పాత రైలు కోచ్‌లను విలాసవంతమైన రెస్టారెంట్‌లుగా మార్చింది, వాటిని ఆదాయ వనరుగా మార్చింది. ఈ పాత కోచ్‌లు ఇప్పుడు ప్రయాణికులతో పాటు ఇతర వ్యక్తులకు సేవలందించేందుకు అందుబాటులో ఉన్నాయి.
స్టేషన్ ఆవరణలో ఈ కోచ్ రెస్టారెంట్లు ఏర్పాటు చేశారు.. ఇక్కడ ప్రజలు హాయిగా కూర్చుని రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించవచ్చు. ముంబై సహా దేశంలోని అనేక నగరాల్లో కోచ్ రెస్టారెంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మొరాదాబాద్ రైల్వే డివిజన్‌లో కోచ్ రెస్టారెంట్‌ను ప్రారంభించేందుకు చొరవ తీసుకుంటున్నారు. ఇక, హరిద్వార్‌లో మొదటి కోచ్ రెస్టారెంట్‌ను ప్రారంభించాలని భావిస్తున్నారు.
రైల్వే స్టేషన్లలో ‘కోచ్ రెస్టారెంట్లు’ను ప్రారంభించారు. ఫైవ్ స్టార్ హోటళ్ల కంటే తక్కువ కాకుండా ఈ సౌకర్యాలు ఈ కోచ్ రెస్టారెంట్లలో అందుబాటులో ఉన్నాయి. రైల్వే హెడ్‌క్వార్టర్స్ నిర్ణయం తర్వాత ఇప్పుడు పనికిరాని రైలు కోచ్‌ను రెస్టారెంట్‌గా మార్చారు. ఢిల్లీ, ఫిరోజ్‌పూర్, ఇతర రైల్వే డివిజన్లలో రైల్ కోచ్ రెస్టారెంట్ అమలు చేయబడింది.
కోచ్ రెస్టారెంట్ ఇంటీరియర్ డెకరేషన్ అదిరిపోతుంది. ఈ రైలు కోచ్ రెస్టారెంట్లు లోపలి నుంచి సరిగ్గా 5 ఫైవ్ స్టార్ హోటళ్లలా కనిపిస్తాయి. ఇక్కడ పెయింటింగ్, పూల అలంకరణలు,మెరుగైన లైటింగ్లు అమర్చారు.. నాగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ‘రెస్టారెంట్ ఆన్ వీల్స్’ని ప్రారంభించింది. ఇందులో కోచ్ లోపల 40 మంది ప్రయాణికులు తినగలరు. విలాసవంతమైన ఇంటీరియర్స్‌తో ఇది ప్రయాణీకులకు సాధారణ ప్రజలకు తెరిచి ఉంటుంది. రాష్ట్రాల వారీగా ఈ కోచ్ రెస్టారెంట్లు సాంప్రదాయ ఆహారాన్ని అలాగే ఉత్తర, దక్షిణ, కాంటినెంటల్ వంటకాలను అందిస్తాయి.