Anupama Parameswaran : ముసిముసి నవ్వులతో మెస్మరైజ్ చేస్తున్న అనుపమ

-

మలబార్ అందం అనుపమ పరమేశ్వరన్ తన క్యూట్ లుక్స్​తో మరోసారి కుర్రాళ్ల మనసు దోచేసింది. తన సోషల్ మీడియా ఖాతాలో ఇవాళ కొత్తగా చేసిన ఫొటోషూట్​కు సంబంధించిన ఫొటోలు షేర్ చేసింది. ఈ ఫొటోల్లో అనుపమ చాక్లెట్ కలర్ డ్రైస్​లో కనిపించింది.

ప్రకృతి ఒడిలో అనుపమ ఎంజాయ్ చేస్తూ ఉన్న ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. ముసిముసి నవ్వుతో మాయ చేయకే అంటూ ఈ క్యూటీని పొగిడేస్తున్నారు.

చాక్లెట్ కలర్ ఔట్​ఫిట్​లో గ్రీనరీ ఉన్న బ్యాక్​గ్రౌండ్​లో అనుపమ పోస్టు చేసిన ఫొటోలకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ ఫొటోల్లో ఈ మలయాళ కుట్టి తన మెస్మరైజింగ్ స్మైల్​తో అందర్నీ మాయ చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.

ఇక సినిమాల విషయానికొస్తే అనుపమ గతేడాది కార్తికేయ-2, 18 పేజెస్​తో బ్లాక్​బస్టర్ హిట్లు కొట్టింది. ప్రస్తుతం టిల్లు స్క్వేర్ సినిమాలో నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమాలో అనుపమ లుక్ రిలీజ్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news