బ్యాంక్ అకౌంట్ నుంచి ఇలా ఈజీగా పోస్టాఫీస్‌‌, సుకన్య సమృద్ధి, పీపీఎఫ్ అకౌంట్లకు డబ్బులని పంపండి..!

-

ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు వాళ్ళకి నచ్చిన స్కీముల్లో డబ్బులని పెడుతున్నారు నిజానికి ఇలా ఇన్వెస్ట్ చేయడం వలన భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండొచ్చు. ఆనందంగా జీవితాన్ని గడిపేయొచ్చు. బ్యాంక్ కస్టమర్లు ఈజీగా ఇప్పుడు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నుండి పోస్ట్ ఆఫీస్ సుకన్య సమృద్ధి పీపీఎఫ్ అకౌంట్ లోకి నేరుగా డబ్బులని పంపవచ్చు అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం… చాలామంది ఈ రోజుల్లో సుకన్య సమృద్ధి యోజన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పోస్ట్ ఆఫీస్ లలో డబ్బులు పెడుతున్నారు నిజానికి ఇలా డబ్బులు పెట్టడం వలన భవిష్యత్తులో ఇబ్బందులు ఏమీ రావు ఈజీగా బ్యాంక్ కస్టమర్లు వాళ్ళ అకౌంట్ నుండి వీటిల్లోకి డబ్బులని పంపుకోవచ్చు.

గంటలు తరబడి క్యూలో నిలబడే పనేలేదు పిపీఎఫ్ సుకన్య సమృద్ధి అకౌంట్ వంటి వాటికి నెఫ్ట్ ఆప్షన్ ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. బెనిఫిషరీ అకౌంట్ ని కూడా యాడ్ చేసుకోక్కర్లేదు ప్రభుత్వం ఇందు మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్ పీపీఎఫ్ అకౌంట్ లేదంటే సుకన్య సమృద్ధి అకౌంట్ కు బెనిఫిషియరీ లేకుండానే డబ్బులు పంపొచ్చు నెఫ్ట్ లేదా ఆర్ టి జి ఎస్ ద్వారా బ్యాంక్ అకౌంట్ నుండి పోస్ట్ ఆఫీస్ కి ఇతర సేవింగ్ అకౌంట్ కి డబ్బులు పంపవచ్చు అలానే పిపిఎఫ్ లేదా సుకన్య సమృద్ధి అకౌంట్ కి కూడా డబ్బులు పంపుకోవచ్చు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి పీఎఫ్ లేదంటే సుకన్య సమృద్ధి కి డబ్బులు పంపేటప్పుడు డిఫాల్ట్ అయ్యి ఉండకూడదు.

డిఫాల్ట్ అయి ఉంటే సిబిఎస్ పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి డబ్బులు డిపాజిట్ చేయాలి. పీపీఎఫ్ అకౌంట్ మెచ్యూర్డ్ అయ్యి ఉంటే ఎక్స్టెన్షన్ ఫార్మ్స్ సబ్మిట్ చేయండి పాస్ బుక్ తో పాటుగా ఈ ఫామ్ ని పోస్ట్ ఆఫీస్ లో ఇవ్వాలి. మెచ్యూరిటీ తర్వాత ఏడదిలోపు ఈ పని చెయ్యాలి. ఈపీఎఫ్ లేదా సుకన్య సమృద్ధి అకౌంట్ కి 50 నుంచి ఎంతైనా డబ్బులు పంపొచ్చు. గరిష్టంగా లక్షన్నర వరకు డబ్బులు అన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఒకవేళ కనుక మీరు డబ్బులు పంపేటప్పుడు టెక్నికల్ సమస్య వచ్చి డబ్బులు కట్టయ్యి ఉంటే మళ్లీ ఆ డబ్బులు ఒక పని దినంలోనే మీ అకౌంట్లోకి పడతాయి. ఇక డబ్బుల్ని ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో చూద్దాం..

దీని కోసం ముందు బ్యాంక్ నెట్‌ బ్యాంకింగ్‌లోకి లాగిన్ అవ్వాలి. ఇప్పుడు పేమెంట్ లేదా ట్రాన్స్‌ఫర్ ట్యాబ్‌ లోకి వెళ్ళండి.
ఆ తర్వాత క్విక్ ట్రాన్స్‌ఫర్ ని సెలెక్ట్ చేసి… ఇప్పుడు బెనిఫీషియరీ పేరు ఎంటర్ చేసేయండి.పీపీఎఫ్, సుకన్య సమృద్ధి, పోస్టాఫీస్ బెనిఫీషియరీ పేరు ఎంటర్ చేయాలి.
ఆ తర్వాత ఇప్పుడు ఇంటర్ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ పేమెంట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి.
ఆ తర్వాత ఐఎఫ్ఎస్‌సీ కోడ్ ని ఎంటర్ చేయాలి.
నెఫ్ట్ ఆప్షన్ ఎంచుకోవాలి. డబ్బులు ని కూడా ఎంటర్ చేసి. ఇలా వివరాలు ఇచ్చాక సబ్‌మిట్ చేయాలి. ఓటీపీ ని కూడా ఎంటర్ చేయాలి. మనీ ట్రాన్స్‌ఫర్ అవుతుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news