ఓ ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి అని అనుకోకండి. ఆయనలా మాట్లాడారంటే అర్థం వేరేగా ఉంటుంది. ఫ్రస్టేషన్ లో భాగంగా ఆయన ఆ విధంగా మాట్లాడి ఉన్నారని పయ్యావుల కేశవ్ అంటున్నారు. ఈయన విఖ్యాత టీడీపీ లీడర్. మేం కూడా అదే విధంగా మాట్లాడితే మీరేం అవుతారు అన్నది ఆయన ప్రశ్న. దీనికి వైసీపీ సమాధానం ఒక్కటే గతంలో వాళ్లు మాట్లాడారు ఇప్పుడు మేం మాట్లాడతాం అని.. అవును ఇప్పటిదాకా మంత్రులే మాట్లాడారు ఇప్పుడు ఆ పరిధి దాటి ఏకంగా కొడాలి నానిని మించిన భాష జగన్ మాట్లాడడం వెనుక ఉద్దేశాలు కారణాలు ఏమయినా కూడా ఈ విధంగా మాట్లాడడం తప్పు.
ఓ సారి వైఎస్సార్ కూడా అసెంబ్లీలో చంద్రబాబును ఉద్దేశించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసి చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డారు. ఆఖరికి విషయం క్షమాపణలు చెప్పేదాకా వెళ్లింది. ఇప్పుడీయన ఈ భాష మాట్లాడుతున్నారంటే మోడీ నుంచి ఏమయినా భరోసా వచ్చిందా? అన్న అనుమానాలు టీడీపీ నుంచి వ్యక్తం అవుతున్నాయి. తాము కూడా అటువంటి భాషే మాట్లాడగలమని కానీ సంస్కారం అడ్డువస్తోందని పయ్యావుల కేశవ్ అన్నారు.
మంత్రి వర్గం మార్పు వల్ల ఎటువంటి లాభం లేదు అని కేంద్రం కూడా భావిస్తోంది. ఎందుకంటే కొత్త మంత్రులు వచ్చి సంబంధిత శాఖలపై అవగాహన తెచ్చుకునేటప్పటికీ కనీసం ఆరు నెలలు పడుతుంది. ఈ లోగా పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఇక ఇప్పుడున్న నాయకులెవ్వరికీ పెద్దగా ప్రొసీజర్ కోడ్ తెలియదు. ధర్మాన ప్రసాదరావు మినహా మిగతా వారికి లెజిస్లేటివ్ బిహేవియర్ తెలియదు. అందుకే వారు అరుస్తుంటారు. వారికి తగ్గట్టుగా టీడీపీ కూడా అరుస్తుంది.
కనుక ఈ రెండు పార్టీలూ కొట్టుకుని కొట్టుకుని ఏపీని అధోగతికి చేర్చడం ఖాయం. మరో పార్టీ ప్రత్యామ్నాయ రీతిలో రానంత వరకూ అయితే బాబు లేదా జగన్ ఈ రాష్ట్రాన్ని ఏలడం ఖాయం. ఇదే కనుక నిజం అయితే ఇంకెన్ని బూతులు వినవాల్సి వస్తుందో అని మాత్రం కంగారు పడకండి. చెప్పాడుగా ఆయన అసూయకు మందు లేదు అని.. అదే విధంగా మూర్ఖత్వానికి కూడా విరుగుడు మందు లేదు.