పుచ్చకాయనా? పాకిస్థాన్ జెర్సీనా? నెట్టింట పేలుతున్న సెటైర్లు!

-

ఆస్ట్రేలియా వేదికగా టి20 ప్రపంచ కప్ 2022 జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ క్రికెట్ జట్టు తమ కొత్త జెర్సీ ని సోమవారం ఆవిష్కరించింది. ఇందుకు సంబంధించిన వీడియోను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ట్విట్టర్ లో షేర్ చేసింది. ఇక పాకిస్తాన్ కొత్త జెర్సీపై నేటిజెన్లు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా నెటిజెన్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డును దారుణంగా రోల్ చేస్తున్నారు.

గత కొన్నేళ్లుగా ముదురు ఆకుపచ్చ లేదంటే లేత ఆకుపచ్చ రంగు జెర్సీలు ధరిస్తూ వస్తుంది. అయితే ఈ రెండు రంగులు కలిపి కొత్త జెర్సీని పిసిబి తయారు చేసింది. అయితే అభిమానులు మాత్రం పాకిస్తాన్ జెర్సీ పుచ్చకాయను తలపించేలా ఉంది అని కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది సెంటర్ ఫ్రూట్ మింగిల్ చాక్లెట్ కవర్ తో ఈ జెర్సీ ని పోలుస్తున్నారు. కాగా ఇప్పటికే టీ20 ప్రపంచ కప్-2022 కోసం భారత్, ఆస్ట్రేలియా వంటి అగ్రశ్రేణి జట్లు తమ న్యూ జెర్సీలను లాంచ్ చేశాయి.

Read more RELATED
Recommended to you

Latest news