సభలో టిఆర్ఎస్ – కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయి – రఘునందన్ రావు

-

సీఎం కేసీఆర్ అసెంబ్లీ ని తన రాజకీయానికి వేదికగా మార్చుకున్నాడని ఆరోపించారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఇది దురదృష్టకరమన్నారు. భవిష్యత్ లో దేశ రాజకీయాల్లోకి వెళ్ళాలని భావిస్తున్న కేసీఆర్ తెలుగు, హిందీ, ఇంగ్లిష్ లో మాట్లాడారని అన్నారు. పరోక్ష మిత్రుడు కాంగ్రెస్, ప్రత్యక్ష మిత్రుడు ఎంఐఎం, టీఆర్ఎస్ కూడబలికి వాళ్ళే మాట్లాడారని అన్నారు.

కరెంట్ విషయం లో కేంద్రం మీద మాట్లాడిన భట్టి విక్రమార్క.. రాష్ట్రం విషయం మాట్లాడలేదని మండిపడ్డారు. 2020 విద్యుత్తు సంస్కరణ బిల్లు తెచ్చి 2022 లో పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన బిల్లు సెలెక్ట్ కమిటీ కి పంపారని అన్నారు. పాస్ కానీ బిల్లు కోసం అసెంబ్లీ లో చర్చించారని అన్నారు. “జాతీయ పార్టీ పెట్టొద్దని ఎవరు అన్నారు. Brs పెట్టుకోండి, Vrs తీసుకోండి.. ఫాం హౌస్ కు పరిమితం అవ్వండి..మాకేం అభ్యంతరం లేదు” అంటూ ఎద్దేవా చేశారు.

మూడు తోకలు..ఎట్లా అధికారం లోకి వస్తారు అంటున్నారని.. ప్రతి పక్షాలను గౌరవించటం మీ దగ్గరే ప్రారంభించండని అన్నారు. మాకు మాట్లాడే అవకాశము ఇవ్వలేదని.. రేపు మాకు మాట్లాడే అవకాశం ఇయ్యండి మీ ప్రశ్నలకు సమాధానం చెప్తాం అన్నారు. మోటర్లకు మీటర్లు పెట్టాలని విద్యుత్ బిల్లులో ఎక్కడా లేదన్నారు. ఈరోజు, రేపు కేంద్ర ప్రభుత్వం టార్గెట్ గానే అసెంబ్లీ సమావేశాల ఎజెండా ఖరారు చేశారని ఆరోపించారు. సభలో టీఆర్ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయన్నారు రఘునందన్ రావు.

Read more RELATED
Recommended to you

Latest news