కార్పొరేటర్ ని రాష్ట్ర అధ్యక్షునిగా చేస్తే ఇలానే ఉంటది : ఉత్తమ్

బీజేపీ, టీఆర్ఎస్ దొంగనాటకం ఆడుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ విమర్శించారు. నోట్ల రద్దుకు, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి టిఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. రాజకీయ అవగాహన, మెచురిటీ లేని వ్యక్తి బండి సంజయ్ అని పేర్కొన్న ఆయన కరీంనగర్ లో చిల్లర కార్పొరేటర్ పదవి చేసి… చిల్లర రాజకీయాలు చేస్తే ఇక్కడ నడవదని అన్నారు. నేను యుద్ధం చేసివచ్చా.. సర్జికల్ స్ట్రైక్ బండి సంజయ్ కి ఏం తెలుసు ? అని ప్రశ్నించారు.

ఒక కార్పొరేటర్ ను తీసుకువచ్చి రాష్ట్ర అధ్యక్షుడిని చేస్తే ఇలానే ఉంటుంది అని ఆయన అన్నారు. బండి సంజయ్ కు హైదరాబాద్ డివిజన్ లు ఎక్కడ ఉంటాయో తెలియదని అన్నారు. ఇక అహ్మద్ పటేల్ మరణం పట్ల టీపీసీసీ విచారం వ్యక్తం చేస్తోందన్న ఆయన కాంగ్రెస్ పార్టీకి అహ్మద్ పటేల్ ఒక పిల్లర్ లాంటి వ్యక్తి.. అలాంటి వ్యక్తిని కోల్పోవడం బాధాకరమని అన్నారు.