అన్ని అమ్ముతారు… కానీ ధాన్యం కొనుగోలు మాత్రం చేయరు అని మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. దేశాన్ని నడిపే వాళ్లకు రైతులపై ప్రేమ లేదని కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న ధర్నాలో సిరిసిల్లలో పాల్గొన్నారు. కేంద్రం తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు వ్యవసాయానికి 6 గంటల కరెంట్ కూడా అందని పరిస్థితి, సాగునీరు రాని సందర్భం.. విత్తనాలకు క్యూలు, ఎరువులకు క్యూలు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ నాయకత్వంతో పరిస్థితి మొత్తం మారిందన్నారు. ప్రపంచంలో మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరాన్ని నిర్మించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. దేశానికి మొత్తం అన్నం పెడుతోందని అన్నారు. వరి వేయద్దని ఢిల్లీ బీజేపీ చెబుతుంటే.. వరి వేయాలని సిల్లి బీజేపీ చెబుతుందని ఎద్దేవా చేశారు. రైతుచట్టాలను వెనక్కి తీసుకోవాలని ఏడాది నుంచి రైతులు ధర్నా చేస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో రైతులపైకి కార్లు ఎక్కిస్తే కేంద్రం కనీసం సంతాపం కూడా తెలియజేయలేదన్నారు. 8 మంది రైతుల మరణానికి కేంద్ర మంత్రి కారణమయ్యాడు. రైతు తిరగబడితే ఎడ్లబండి కింద నలిగిపోతారని కేంద్రాన్ని హెచ్చిరించారు.