గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో ఇండియా 102 స్థానంలో ఉంది – మంత్రి కేటీఆర్.

-

ధాన్యం కొనుగోలు వ్యవహారంపై మంత్రి కేటీఆర్ సిరిసిల్ల చేస్తున్న నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ర్యాకింగ్స్ లో 116 దేశాల్లో ఇండియా 102 స్థానంలో ఉందని… దీనికి కారణం ఎవరని ప్రశ్నించారు. 75 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఏం చేశాయన్నారు. బీజేపీ పార్టీ ప్రతీ చిన్న విషయానికి పాకిస్తాన్ అని మాట్లాడుతుంది.. అది కూడా మనకంటే తక్కవ ర్యాకింగ్ లో ముందుందన్నారు. పాకిస్తాన్ 92 ర్యాంకు.. నేపాల్ 76 ర్యాంకు, బంగ్లాదేశ్ 86 వ ర్యాంకులో ఉన్నాయి.. ఇన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఏం చేశాయని ప్రశ్నించారు. ఇక చైనాతో పోల్చుకునే పరిస్థితి లేదన్నారు.

దేశంలో 40 వేలకోట్ల ఎకరాల సాగుభూమి ఉంది, గంగా, బ్రహ్మపుత్ర, గోదావరి వంటి జీవ నదుల్లో 65 వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉంది, అయినా వ్యవసాయంలో వెనుకబడే ఉన్నాం అని సిగ్గు పడాలని అన్నారు. దేశంలో సారవంతమైన నల్లరేగడి, ఎర్ర నేలలు, పంటలకు అనుకూలమైన అన్ని నేలలు ఉన్నాయని… సమశీతోష్ణ వాతావరణం ఉందని కానీ వ్యవసాయాన్ని అభివ్రుద్ది చేయడం లేదని గత ప్రభుత్వాల పనితీరుపై ధ్వజమెత్తారు. దేశంలో వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ల చేతిలో పెట్టి.. రైతును కూలీగా మార్చేలా కేంద్రం వ్యవహరిస్తుందని కేటీఆర్ ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news