అది పాదయాత్ర కాదు.. విలాస యాత్ర.. బండిసంజయ్ ఫైర్ అయిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. గతకొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో బండి సంజయ్, పాదయాత్ర చేస్తున్నారు. ప్రజా సంగ్రామ యాత్ర అని దీనికి పేరు పెట్టారు. ఈ పాదయాత్ర పర్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై బండి సంజయ్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఐతే తాజాగా బండి సంజయ్ పాదయాత్రపై కౌంటర్లు పడుతున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడుతూ, అది పాదయాత్ర కాదని, విలాస యాత్ర అని అన్నారు.

20కిలోమీటర్లు కూడా లేని చోట 40కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారా అని ప్రశ్నించారు. ఇంకా పాదయాత్ర చేసిన కేసీఆర్ గురించి వివరిస్తూ, రోజుకు 40కిలోమీటర్లు పాదయాత్ర చేసారని గుర్తు చేసారు. పాదయాత్రలో బండి సంజయ్ బాష అదుపు తప్పుతుందని, ప్రజల్లో వైషమ్యాలను రెచ్చగొట్టేలా బండి సంజయ్ మాట్లాడుతున్నారని అన్నాడు. అవి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం అని ఫైర్ అయ్యారు.