చిక్కుల్లో మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే… బూతు ఆడియో వైరల్ !

ఈ మధ్యకాలంలో వరుసగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివాదాల్లో చిక్కుకున్నారు. అధికారులతో నో లేదా సామాన్యులతో నో దురుసుగా ప్రవర్తిస్తూ చర్చలోకి వస్తున్నారు. తాజాగా అలాంటి వివాదం లోనే టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరు చిక్కుకున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్ బూతు పురాణం ఇప్పుడు నెట్ లో వైరల్ గా మారింది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే సుమారు నాలుగేళ్ల క్రితం రంజాన్ పండుగకు బోధన్ ఎమ్మెల్యే షకీల్ తన నియోజకవర్గ ముస్లింలకు రంజాన్ తోఫా ప్యాకెట్లు పంపిణీ చేశాడు. ఈ తోఫా ప్యాకెట్లను కామారెడ్డి జిల్లా బాన్సువాడ కు చెందిన అభిషేక్ కిరానా అనే షాప్ కు చెందిన మురళీధర్ అనే వ్యక్తి వద్ద కొనుగోలు చేశారు.

ఆరు వేల ప్యాకెట్లు ఒక్కొక్కటి 600 చొప్పున ఆర్డర్ ఇచ్చారు. ఈ మొత్తం బిల్లు దాదాపు 36 లక్షలు అయింది. ఈ 36 లక్షల కు గాను 12 లక్షలు చెల్లించి సరుకు తీసుకువెళ్లారు. ఆ తర్వాత 2018 ఎన్నికల ప్రచారం సమయంలో నిమిత్తం ఒక నాలుగు లక్షల వంట సామాగ్రి తీసుకువెళ్లారు. ఇలా పలు దఫాలుగా డబ్బులు చెల్లించకుండా సరుకులు వాడుకుంటూ మొత్తం మీద 30 లక్షల రూపాయల బిల్లు చేశారు. రెండేళ్ల నుంచి ఆ డబ్బు కట్టకపోవడంతో సదరు వ్యాపారి ఎమ్మెల్యే చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయినా ఎమ్మెల్యే కొనికరించకపోవడంతో బాధితుడు ఎమ్మెల్యే సన్నిహితుడని కలిసి ఎమ్మెల్యే గారిని కరుణించేలా చేయమని కోరాడు. దీంతో సదరు ఎమ్మెల్యే గారు రెండు రోజుల క్రితం మురళీధర్ తో ఫోన్లో మాట్లాడారు. ఆ మాట్లాడుతున్న సమయంలో కాస్త మితిమీరి బూతు పురాణం వినిపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.