టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ, సిఎం కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడు జోగినపల్లి సంతోష్ కుమార్ కు పార్లమెంట్ లో మరో పదవి దక్కింది. పార్లమెంట్ పబ్లిక్ అండర్ తెకిన్గ్స్ కమిటి సభ్యుడిగా ఆయననను నియమించినట్టు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఉత్తర్వులు జారీ చేసారు. కమిటి చైర్మన్ గా మీనాక్షి లేఖ నియమితులు అయ్యారు. మరో 21 మంది సభ్యులుగా లోక్సభ నుంచి 15 మంది రాజ్యసభ నుంచి 7 మంది నియమితులు అయ్యారు.
2020-21కి గానూ ఆయనకు ఈ పదవి దక్కింది. ఈ పదవి దక్కడంపై టీఆర్ఎస్ నేతలు ఆయన శుభాకాంక్షలు చెప్పారు. కేసీఆర్ 2019 ఎన్నికల సమయంలో జాతీయ రాజకీయాలకు వెళ్ళాలి అని భావించి తన సన్నిహితుడికి రాజ్యసభ సీటు ఇచ్చారు. ఆయన ఢిల్లీ లో కీలకంగా వ్యవహరిస్తే సంతోష్ సహకారం అవసరం అని భావించి రాజ్యసభకు పంపించారు. ఇక సంతోష్ కి ఉత్సాహవంతుడు అనే పేరు కూడా ఉంది. గ్రీన్ ఛాలెంజ్ ని ఆయనే మొదలుపెట్టగా మంచి స్పందన వచ్చింది.