పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో టీఆర్ఎస్ ఎంపీల నిససనలు కొనసాగుతున్నాయి. రైతుల ప్రయోజనాలపై టీఆర్ఎస్ ఎంపీల పోరు కొనసాగుతోంది. దేశంలో సమగ్ర జాతీయ ధాన్యం కొనుగోలు విధానం తీసుకురావాలని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా కేంద్రం తీరుకు నిరసనగా టీఆర్ఎస్ ఎంపీలు లోక్ సభ నుంచి వాకౌట్ చేశారు. మరో వైపు తెలంగాణ లో ధాన్యం కొనుగోలు, రైతుల సమస్యలపై రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు వాయిదా తీర్మాణాన్ని ఇచ్చారు. వాయిదా తీర్మాణాన్ని రాజ్య సభ చైర్మన్ వెంకయ్య నాయుడు తిరస్కరించారు. కేంద్రానికి నిరసన తెలిపేందుకు టీఆర్ఎస్ ఎంపీలు నల్ల చొక్కాలతో సమావేశాలకు హాజరయ్యారు. తాజాగా కేంద్రం తీరుకు నిరసనగా టీఆర్ఎస్ ఎంపీలు. రబీ ధాన్యం సేకరణలో కేంద్రం వివక్ష చూపిస్తుందని కేశవరావు ఆరోపించారు.
మరోవైపు పార్లమెంట్ సమావేశాలను టీఆర్ఎస్ ఎంపీలు బహిష్కరించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయినప్పటి నుంచి టీఆర్ఎస్ ఎంపీలు తమ నిరసనను తెలుపుతూనే ఉన్నారు. తెలంగాణలో ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు వ్యవహారంపై పార్లమెంట్ వేదికగా ఇటీవల కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కూడా ప్రకటన చేశారు.