పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించిన టీఆర్ఎస్…

-

పార్లమెంట్ సమావేశాలను బహిష్కరిస్తూ టీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం ఏడో రోజు ప్రారంభం అయిన తర్వాత లోక్ సభలో, అటు రాజ్యసభలో రైతుల సమస్యలు, మద్దతుధర, ధాన్యం కొనుగోలు అంశాలపై సభలో చర్చకు పట్టుబట్టారు. రైతు సమస్యలను చర్చించాలని ఇరు సభల్లో వాయిదా తీర్మాణాలు ఇచ్చారు. లోక్ సభ పోడియం వద్ద ఎంపీలు నినాదాలు చేస్తూ నిరసనలు తెలిపారు. అయితే వాయిదా తీర్మాణాలను సభాపతులు తిరస్కరించారు.

కేంద్ర అవలంభిస్తున్న తీరుకు నిరసనగా టీఆర్ఎస్ ఎంపీలు వాకౌట్ చేశారు. లోక్ సభ నుంచి 9 మంది ఎంపీలు, రాజ్యసభ నుంచి 7 మంది ఎంపీలు వాకౌట్ చేశారు. అనంతరం ఈ నెల 23 వరకు జరుగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించడం ద్వారా కేంద్రంపై ఒత్తడి తీసుకురావాలని టీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. కాగా నేడు లేదా రేపు ఎంపీలు ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు రానున్నారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ధాన్యం కొనుగోలుపై కేంద్రాన్ని నిలదీస్తున్నాయి. తెలంగాణ రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా పార్లమెంట్ బహిష్కరించిన ఎంపీలు భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. ఢిల్లీలో ధర్నా చేయాలనే ప్లాన్ లో ఎంపీలు ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news