అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏది మాట్లాడినా ఏది చేసినా వివాదమే. తాజాగా ఒక కక్కుర్తి పని చేసి ట్రంప్ వివమర్శాల పాలు అయ్యారు. బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు కోబ్ బ్రయంట్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. అతనితో పాటుగా అతని 13 ఏళ్ళ కుమార్తె కూడా ప్రాణాలు కోల్పోయి౦ది. దీనితో ప్రపంచ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు అతనికి నివాళి అర్పిస్తున్నారు.
సోషల్ మీడియా వేదికగా అతనికి అభిమానులు కూడా నివాళులు అర్పిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఒక ట్వీట్ పోస్ట్ చేసి, “కోబ్ బ్రయంట్, ఎప్పటికప్పుడు గొప్ప బాస్కెట్‌బాల్ క్రీడాకారులలో ఒకరిగా ఉన్నప్పటికీ, జీవితంలోకి ఇప్పుడే అడుగు పెడుతున్నాడు. అతను తన కుటుంబాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు మరియు భవిష్యత్తు పట్ల అంత బలమైన అభిరుచి కలిగి ఉన్నాడు.
Kobe Bryant, despite being one of the truly great basketball players of all time, was just getting started in life. He loved his family so much, and had such strong passion for the future. The loss of his beautiful daughter, Gianna, makes this moment even more devastating….
— Donald J. Trump (@realDonaldTrump) January 26, 2020
తన అందమైన కుమార్తె జియానాను కోల్పోవడం ఈ క్షణం మరింత విషాదకరమైనది. మెలానియా మరియు నేను వెనెస్సా మరియు అద్భుతమైన బ్రయంట్ కుటుంబానికి మా హృదయపూర్వక సంతాపాన్ని తెలుపుతున్నాము. అని ట్వీట్ చేసాడు. వాస్తవానికి ఈ ట్వీట్ ని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పోస్ట్ చేసారు. ఒబామా చేసిన కాసేపటికే ఇదే ట్వీట్ ని ట్రంప్ కాపీ చేసారు. దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Kobe was a legend on the court and just getting started in what would have been just as meaningful a second act. To lose Gianna is even more heartbreaking to us as parents. Michelle and I send love and prayers to Vanessa and the entire Bryant family on an unthinkable day.
— Barack Obama (@BarackObama) January 26, 2020