అడవిలో ఎలుగుబంటితో ఎదురుపడినప్పుడు ఇద్దరు స్నేహితులు చేసిన పని గుర్తుందా. ఇద్దరు మిత్రుల్లో ఒకరు తన ప్రాణాన్ని కాపాడటానికి చెట్టు ఎక్కగా, మరొకరు ఎం చెయ్యాలో తెలియక నేలమీద పడుకుని, ఊపిరి పీల్చుకోవడం ఆపేసి చనిపోయినట్లు నటిస్తారు. ఇప్పుడు ఒక వ్యక్తి అలాగే చేసి ప్రాణాలు కాపాడుకున్నారు. ఒక పులి మనిషి ఛాతీపై తన రెండు పాదాలను ఉంచి చనిపోయినట్టు నటించి ప్రాణాలు కాపాడుకున్నాడు.
ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ ఇటీవల ఒక వీడియో పోస్ట్ చేసారు. ఆ వీడియోలో పులి ఆ వ్యక్తి మీద కాళ్ళు పెట్టి ఉండగా పులి మోహాని దగ్గరగా ఆ వ్యక్తి మొహం ఉంటుంది. అప్పుడు చనిపోయినట్టు నటించి ఆ పులి బారి నుంచి ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడుకుంటాడు. మరో ట్విట్టర్ యూజర్, పూర్తి 30 సెకన్ల వీడియోను పంచుకున్నారు. మహారాష్ట్రలోని భండారా జిల్లాలోని తుమ్సర్‌లో ఈ సంఘటన జరిగిందని ఆయన అన్నారు.
పొలాల్లో ఉన్న పులి భయపడి పారిపోవడానికి ప్రయత్నించి అక్కడ ఉన్న ఒక వ్యక్తి వద్దకు వెళ్తుంది. కాని అతను ఏ మాత్రం భయపడకుండా పారిపోకుండా అక్కడే పడుకునిపోయాడు. దీనితో అతన్ని చూసిన ఆ పులి వాసన చూసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీనితో అతను ప్రాణాల నుంచి బయటపడ్డాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. అదృష్టం అంటే ఇదే అని పలువురు కామెంట్ చేస్తున్నారు.
https://twitter.com/ParveenKaswan?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1221062205774319616&ref_url=https%3A%2F%2Fwww.indiatoday.in%2Ftrending-news%2Fstory%2Fman-plays-dead-to-protect-himself-from-tiger-viral-video-from-maharashtra-will-give-you-goosebumps-1640346-2020-01-26
Here's the full video pic.twitter.com/Avvci4Bnhg
— WTF ?? (@Tweetbis0n) January 25, 2020