ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ప్లాట్ పారాలు చాలా అత్యవసరం అయ్యాయి. సాధారణ వ్యక్తుల దగ్గర నుంచి దేశాల అధ్యక్షల దాకా తమ అభిప్రాయలను వెల్లడించడానికి సోషల్ మీడియా సాధనంగా మారింది. తమ అభిమానులకు, అనుచరులకు చేరువయ్యేందుకు ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా వేదికలు ఉపయోగపడుతున్నాయి. కాగా అమెరికా మాజీ అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ కూడా ట్విట్టర్ అకౌంట్ పునరుద్ధరణ కోసం పోరాడుతున్నాడు.
గత అధ్యక్ష ఎన్నికల సమయంలో క్యాపిటల్ హౌజ్ పై ట్రంప్ మద్దతుదారులు దాడికి తెగబడ్డారు. ఘటన అనంతరం ట్రంప్ తన అనుచరులను ఉద్ధేశిస్తూ ట్విట్టర్ ద్వారా పలు వ్యాఖ్యలు చేశారు. ఈ హింసాకాండ అనంతరం ట్విట్టర్ ట్రంప్ ఎకౌంట్ ను బ్లాక్ చేసింది. ప్రస్తుతం తన అకౌంట్ ను పునరుద్ధరించాల్సిందిగా చూడాలని ఫ్లోరిడాలోని పెడరల్ కోర్ట్ జడ్జ్ ను ఆశ్రయించారు. నిషేధానికి ముందు ట్రంప్ అకౌంట్ కు 88 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.