ఈ తెల్లటి ఆహార పదార్ధాలని ఎక్కువగా తీసుకుంటే అంతే సంగతులు..!

-

మనం తీసుకునే ఆహారం బట్టి మన ఆరోగ్యం ఉంటుంది. అయితే మనకు తెలియక చాలా ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము. వీటి వల్ల చాలా నష్టం కలుగుతుందని నిపుణులు అంటున్నారు. ఈ పదార్థాలు తెల్లగా ఉంటాయి. మనం ప్రతి రోజూ వాడుతూనే ఉంటాం.

 

white food

అయితే ఈ తెల్లటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఒబిసిటీ, డయాబెటిస్, క్యాన్సర్ మొదలైన సమస్యలు వస్తాయని నిపుణులు చెప్పడం జరిగింది. అయితే ఆ ఆహార పదార్థాలు ఏవి..?, వేటికి దూరంగా ఉండాలి..?, వాటి వల్ల కలిగే సమస్యలు ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం. మరి ఎటువంటి ఆలస్యం లేకుండా దీనికోసం తెలుసుకోండి.

సాధారణంగా మనం వంటల్లో ఉప్పు, పంచదార, పిండి, అజినోమోటో ని ఎక్కువగా వాడుతూ ఉంటాము. అయితే ఈ నాలుగు ఆహార పదార్థాలు చాలా ప్రమాదకరమని… ఆరోగ్యానికి హాని చేస్తాయని తెలుస్తోంది.

పంచదార:

పంచదారలో ఎటువంటి పోషక పదార్థాలు ఉండవు. అయితే అది ఒకసారి డైజెస్టివ్ ట్రాక్ట్ కి వెళ్ళిన తర్వాత గ్లూకోజ్ మరియు ఫ్రూక్టోజ్ కింద బ్రేక్ అవుతుంది. ఒకవేళ కనుక ఫిజికల్ యాక్టివిటీ లేదు అంటే అప్పుడు అది ఫ్యాట్ కింద స్టోరీ అయిపోతుంది. ఇన్సులిన్ పైన కూడా ఇది ప్రభావం చూపిస్తుంది. దీంతో డయాబెటిస్ రిస్క్ ఎక్కువవుతుంది. అయితే రోజుకు 5 టీస్పూన్ల కంటే పంచదార వేసుకోకూడదు. 40 ఏళ్లు దాటిన తర్వాత మరింత తగ్గించాలి లేకుంటే అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు.

అజినోమోటో:

అజినోమోటో కూడా ఎక్కువగా వంటలలో వాడుతుంటారు. ఎక్కువగా చైనీస్ ఫుడ్ తయారు చేయడానికి వాడుతారు. దీని వల్ల కూడా ఇబ్బందులు వస్తాయని ఆరోగ్యానికి హానీ మాత్రమే కలుగుతుందని చెబుతున్నారు. కాబట్టి దీనిని కూడా వాడకండి.

సాల్ట్:

సాల్ట్ వల్ల ఎంత ముప్పు కలుగుతుందో మనందరికీ తెలుసు ప్రత్యేకంగా దీని గురించి చెప్పక్కర్లేదు హైబీపీ రావడానికి కారణం సాల్ట్. అదే విధంగా మరెన్నో అనారోగ్య సమస్యలను ఈ సాల్ట్ తీసుకు వస్తుంది. కాబట్టి దీనికి దూరంగా ఉండండి.

పిండి:

మైదా వల్ల కూడా సమస్యలు వస్తాయి. మైదాతో చాలా వంటలు మనం తయారు చేసుకుంటూ ఉంటాము. అయితే మైదా ఎక్కువ తీసుకోవడం వల్ల ఒబేసిటీ, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు వస్తాయి మైదాతో తయారు చేసిన ఆహారాన్ని వారానికి ఒకసారి కంటే ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు కాబట్టి దీనిని కూడా తగ్గించండి. లేదంటే ఇబ్బందులు తప్పవు.

Read more RELATED
Recommended to you

Latest news