కరోనా వైరస్ విషయంలో ఇప్పుడు అమెరికా చాలా సీరియస్ గా ఉంది. ఊహకు అందని విధంగా సునామి కంటే దారుణంగా అక్కడ పరిస్థితులు ఉన్నాయి. సునామి అయితే వచ్చి పోతుంది. కాని ఇది మాత్రం చాలా దారుణంగా ఉంది అక్కడ. కళ్ళ ముందే 20 వేల మంది వరకు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తుంది ఆ దేశాన్ని. ట్రంప్ కూడా ఎం చెయ్యాలో అర్ధం కాని స్థితిలో ఉన్నారు ఇప్పుడు.
ఈ తరుణంలో ఆయన వీసాల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైరస్ ప్రభావం ఈ స్థాయిలో ఉన్న నేపధ్యంలో… అమెరికాలో ఉంటున్న విదేశీ పౌరులను స్వదేశాలకు తీసుకెళ్లడంలో నిర్లక్ష్యం వహిస్తున్న దేశాలపై ఆంక్షలు విధించారు ట్రంప్. ఈ నిర్ణయాన్ని ఆయన తాజాగా ప్రకటించారు. ఏ దేశాలు అయితే తీసుకుని వెళ్ళకుండా ఉద్దేశ పూర్వకంగా జాప్యం చేస్తున్నాయో వాళ్లకు ట్రంప్ ఇప్పుడు చుక్కలు చూపించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఆ దేశాల నుంచి వచ్చే వాళ్లకు వీసాను నిరాకరిస్తామని… కఠిన ఆంక్షలు అమలు చేస్తామని ఇది తక్షణమే అమలు లోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. డిసెంబర్ వరకు ఇది అమలులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కావాలనే కొన్ని దేశాలు ఈ విషయంలో ఆలస్యం చేస్తున్నాయని, ఈ చర్య అమెరికా పౌరుల ఆరోగ్యానికి ముప్పు కలుగజేసే అంశమని ఆయన హెచ్చరించారు. త్వరలో హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఆయా దేశాలకు నోటీసులు జారీ చేస్తుందన్న ఆయన… తక్షణం స్పందించకపోతే ఆంక్షలు అమలవుతాయని పేర్కొన్నారు.