ఆ డాక్ట‌ర్ల‌కు ఏపీ ప్ర‌భుత్వం హెచ్చ‌రిక‌లు.. ఇక‌పై అలా చేస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వు..!!

-

క‌రోనా వైర‌స్ దేశ‌దేశాల‌ను రాజై పాలిస్తోంది. పేద‌.. ధ‌నిక‌, పెద్దా.. చిన్నా అని తేడా లేదు దానికి. ఎవ‌రైనా.. ఎంత‌టివాడైనా ఈ మ‌హ‌మ్మారి ముందు త‌ల వంచాల్సిందే. ఎప్పుడు.. ఎవ‌రిని.. ఎలా కాటేస్తుందో తెలియ‌క ప్ర‌జ‌లు క్ష‌ణక్ష‌ణం భ‌యంతో బ‌తుకుతున్నారు. ఈ ర‌క్క‌సికి వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో ప్ర‌భుత్వాలకు సైతం పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. అయిన‌ప్ప‌టికీ.. ఆ మ‌హ‌మ్మారిని ఎలాగైనా మ‌ట్టుపెట్టాల‌ని ప్ర‌పంచ‌దేశాలు ఆయుధం లేకుండా యుద్ధం చేస్తూనే ఉన్నాయి.

ఇక ఏపీలో సైతం క‌రోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్ప‌టికే రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 381కి చేర‌గా.. మ‌ర‌ణాల సంఖ్య 6కు చేరింది. అనంతపురం, కృష్ణా జిల్లాల్లో ఇద్దరు కోవిడ్‌కు బలి కాగా.. గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాత పడ్డారు. ఇలా క‌రోనా వేగాన్ని పెంచుతుండ‌డంతో.. ప్ర‌భుత్వం సైతం క‌ఠ‌న చ‌ర్య‌లు తీసుకుంటుంది. ఈ క్ర‌మంలోనే తాజాగా ఆర్‌ఎంపీ డాక్ట‌ర్ల‌కు స్ట్రోంగ్ వార్నింగ్ ఇచ్చింది.

జలుబు, దగ్గు, జ్వరంతో వచ్చే వారికి ఆర్‌ఎంపీలు వైద్యం చేయొద్దని వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆర్ఎంపీలకు వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా, కోవిడ్‌ లక్షణాలున్న వ్యక్తుల గురించి స్థానిక వైద్య సిబ్బందికి స‌మాచారం ఇవ్వాల‌ని సూచించింది. అలాగే కరోనాను ఎదుర్కొనేందుకు ప్రతి జిల్లాకూ ఒక కరోనా హాస్ప‌ట‌ల్ ఉంద‌ని.. అందుబాటులో నాలుగు రాష్ట్రస్థాయి కరోనా హాస్ప‌ట‌ల్స్‌ ఉన్నాయ‌ని వెల్ల‌డించింది. ఒక‌వేళ ఈ ఆదేశాల‌ను ఉల్లంఘించే ఆర్‌ఎంపీలపై క‌ఠ‌న‌మైన‌ చర్యలు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించింది.

Read more RELATED
Recommended to you

Latest news