సాల్టెడ్ బటర్ కు బదులుగా ఈ నాచురల్ బటర్ ను ట్రై చేయండి..!

-

అందరూ తెలియక ఆరోగ్య విషయంలో కొన్ని తప్పులు చేస్తుంటారు..వీటికి ఇవే వాడాలి అనుకునే అవే వాడుతాం..పులుపుకోసం చింతపండునే వాడుతాం..కానీ మామిడిపౌడర్ ను వాడొచ్చు.. .అలాగే సాల్టెడ్ బటర్ కు బదులుగా ఏం వాడొచ్చు ఈరోజు చూద్దాం. చాలామంది సాల్టెట్ బటర్ ను ఎక్కువగా వాడేస్తుంటారు. నిజానికి ఇది అంత మంచిది కాదు..దానికి బదులుగా నాచురల్ బటర్ ఉంది..బటర్ ఫ్రూట్ నుంచి వచ్చిన బటర్ ఇది. యానిమల్ బటర్ కు బదులుగా ప్లాంట్ బటర్ ను వాడుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది..ఈరోజు ఆ నాచురల్ బటర్ ఏంటో చూసేద్దాం.
ఈ బటర్ ఫ్రూట్ పేరే..అ‌వకాడో.ఈ పేరు అందరూ వినేఉంటారు. దీన్నే బటర్ ఫ్రూట్ అంటారు. దీని లోపల ఉండే గుజ్జు వెన్నలా ఉంటుంది. అన్ని ఫ్రూట్స్ కంటే..అతి బలమైన ఫ్రూట్ అ‌వకాడో.
నేషనల్ ఇన్సిస్టిటూ ఆఫ్ నూట్రిషన్ వారు ఇచ్చిన లెక్కల ప్రకారం. 100 గ్రాముల అవకాడోలో ఉండే పోషకాలు
  • పండ్లల్లో ఎక్కువ శక్తిని ఇచ్చే పండు అరటిపండు116 కాలరీలు ఉంటాయి. అలాగే అవకాడో తీసుకుంటే 215 కాలరీలు. .
  • అవకాడోలో కొవ్వు 23 గ్రాములు ఉంటుంది.
  • కార్భోహైడ్రేట్ 1 గ్రాము మాత్రమే
  • ప్రొటీన్ 2 గ్రాములు
  • పీచుపదార్ధాలు 7 గ్రాములు

ఈ అవకాడో ఫ్రూట్ వల్ల శరీరానికి ఆరోగ్యానికి ఏ విధంగా మేలు చేస్తుంది

వచ్చేది ఎండాకాలం..డీహైడ్రేషన్ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ ఫ్రూట్ లో ఉన్న మినరల్స్ కొన్ని బాడీని డీహ్రైడ్రేషన్ రాకుండా..సోడియం, పొటాషియనం బాలెన్స్ చేసి..బాడీని కూల్ గా ఉంచుతుందట.
ఇంకా ఇందులో పీచుపదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల మోషన్ ట్రబుల్ రాదు. మలబద్ధకం సమస్య ఉండదు. ఇంకా మనం తీసుకున్న ఆహారపదార్థాల్లో కొవ్వులు త్వరగా రక్తంలోపలకి చేరకుండా స్లోగా వెళ్లటం వల్ల బరువుపెరగరు, కొవ్వను కరిగించడానికి ఉపయోగడుతుంది.
ఇంకాఈ ఫ్రూట్ లో ఉండే అవకాటిన్ అనే కెమికల్ ఎఫెక్ట్ బ్లడ్ క్యాన్సర్ కు కారణమైన కణజాలన్ని చంపడానికి, అలాంటి బ్లడ్ క్యాన్సర్ నిరోధించడానికి స్పెషల్ గా పనిచేస్తుంది.
మెదడు కణాలకు రక్తప్రసరణను బాగా పెంచి..హ్యాపి హార్మోన్స్ సెరటోనిన్, డొపమైన్ అనే హార్మోన్స్ ను ఎక్కువ రిలీజ్ చేస్తుంది. ఇ‌వి ఎంత ఎక్కువ రిలీజ్ అయితే మన ఆరోగ్యం అంత బాగుంటుంది.
అవకాడో ఫ్రూట్ లో ఉండే బిటాసైటోస్టిరాల్ అనే కెమికల్ ఎఫెక్ట్ వల్ల మగవారిలో ప్రొస్టేట్ క్యాన్సర్ రాకుండా బాగా ఉపయోగపడుతుంది.
ఇలాంటి లాభాలు ఉన్నాయి..ప్రకృతి ప్రసాదించిన అనేక పండ్లను మనం తింటూ ఉంటాం..కానీ ఇది కాస్త ఖరీదు అనుకుని అవకాడోను చాలా మంది దూరం చేసుకుంటాం..అనేక దుబార ఖర్చులు చేస్తాం..పిజ్జా, బర్గర్ కంటే తక్కువే కదా..డబ్బులతో ఆరోగ్యం కొనుక్కోలేం కానీ..పండ్లతో అయితే కొనుక్కోవచ్చు కదా..కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి ఫ్రూట్ ని అందరూ తినటానికి ట్రై చేయండి. ముఖ్యంగా పిల్లలకు, కండపుష్టికి, ఆటలు ఆడేవారికి, గర్భిణీలకు, బాలింతలకు, హార్డ్ వర్కర్స్ కు ఈ అవకాడో 100 గ్రాములు డైలీ తింటే చాలు..ఆరు కోడిగుడ్లు తిన్నట్లే..

ఇంతకీ అవకాడో ఫ్రూట్ ను ఎలా వాడుకోవచ్చు.

బటర్ ఎక్కడ ఉపయోగం ఉంటుందో…అక్కడ ఈ అవకాడో ఫ్రూట్ ను వాడేయొచ్చు. బ్రడ్ మీద ఈ అవకాడో ఫ్రూట్ గుజ్జు పూసేసుకుని తినేయొచ్చు, సలాడ్స్ మీద వేయొచ్చు. వంటల్లో కూడా బటర్ వేసేవి ఉంటాయి..అప్పుడు ఈ అ‌వకాడో గుజ్జువాడొచ్చు. శాండివిచ్ లో బాగా వాడుకోవచ్చు. మిల్క్ షేకుల్లో వేసుకోవచ్చు.
కఫాలు, రొంపలు, శ్లేష్మాలు ఉన్నవారికి ఇది చాలా మంచిది. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి వీలైనప్పుడల్లా వాడుకునేందుకు ప్రయత్నించండి.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news